Andhra News: విద్యుత్‌ ఉద్యోగులకు అందని జీతాలు

విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు యాజమాన్యం షాక్‌ ఇచ్చింది. ప్రతి నెలా మొదటి తేదీన ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలను నిలిపేసింది.

Updated : 02 Dec 2022 07:17 IST

ఈనాడు-అమరావతి: విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు యాజమాన్యం షాక్‌ ఇచ్చింది. ప్రతి నెలా మొదటి తేదీన ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలను నిలిపేసింది. దీనికి నిధులు సర్దుబాటు కాకపోవడమే కారణమని సమాచారం. దీంతో ఉద్యోగులకు నవంబరు నెల జీతం గురువారం రాత్రి వరకు అందలేదు.  జెన్‌కో, ట్రాన్స్‌కో, మూడు డిస్కంల పరిధిలో పనిచేస్తున్న సుమారు 28 వేల మంది సిబ్బందికి మరోసారి నిరీక్షణ తప్పలేదు. గత ఫిబ్రవరిలో సుమారు రెండు వారాల పాటు జీతాల చెల్లింపులో యాజమాన్యం ఆలస్యం చేసింది. జెన్‌కో ఉద్యోగులు ఎండీ కార్యాలయం ఎదుట ఆందోళన చేసిన తర్వాత జీతాలను విడుదల చేసింది. అప్పటి నుంచి ప్రతి నెలా మొదటి తేదీనే చెల్లిస్తోంది. మళ్లీ 8 నెలల తర్వాత.. ఒకటో తేదీన జీతాలు చెల్లించలేదు. పింఛన్‌దారులు, కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. సోమవారం నాటికి నిధులు సర్దుబాటు అవుతాయని, అదే రోజు జీతాలు చెల్లిస్తామని యాజమాన్యం చెబుతోందని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని