జగనన్న స్మార్ట్ టౌన్షిప్లకు ససేమిరా
ప్రభుత్వ భూములు అందుబాటులో లేనిచోట ప్రైవేటు స్థిరాస్తి వ్యాపారులతో మధ్య ఆదాయ వర్గాల (ఎంఐజీ) కోసం జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లను సిద్ధం చేయాలన్న ప్రతిపాదనలకు స్పందన కొరవడింది.
నిర్మాణానికి స్థిరాస్తి వ్యాపారుల వెనుకంజ
ప్రైవేటుగా చేపట్టాలన్న ప్రభుత్వ ప్రతిపాదనలకు చుక్కెదురు
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ భూములు అందుబాటులో లేనిచోట ప్రైవేటు స్థిరాస్తి వ్యాపారులతో మధ్య ఆదాయ వర్గాల (ఎంఐజీ) కోసం జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లను సిద్ధం చేయాలన్న ప్రతిపాదనలకు స్పందన కొరవడింది. దాదాపు 18 పట్టణాభివృద్ధి సంస్థల్లో వ్యాపారుల నుంచి బిడ్లు ఆహ్వానించగా గడువు ముగిసినా ఎవరూ ముందుకు రాలేదు. పట్టణాల్లో మధ్య ఆదాయ వర్గాల కోసం మార్కెట్లో స్థిరాస్తి వ్యాపారులు విక్రయిస్తున్న ధరకంటే తక్కువకు ఇళ్ల స్థలాలు (ప్లాట్లు) కేటాయించేలా జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం వాలంటీర్లతో పుర, నగర పాలక సంస్థల్లో నిర్వహించిన సర్వేలో 3,93,872 మంది 150, 200, 240 చ.గజాల్లో స్థలాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నట్లు గుర్తించారు. పట్టణాలకు సమీపంలో స్మార్ట్ టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం మొదట ప్రకటించింది. పలుచోట్ల ప్రభుత్వ భూములు అందుబాటులో లేవన్న కలెక్టర్ల నివేదికతో అలాంటి ప్రాంతాల్లో ప్రైవేటు స్థిరాస్తి వ్యాపారులతో ప్రాజెక్టుల ఏర్పాటుకు బిడ్లు ఆహ్వానించింది. విశాఖపట్నం, తిరుపతి, మచిలీపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, ఏలూరు, ఒంగోలు, శ్రీకాకుళం తదితర చోట్ల పట్టణాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో ప్రైవేటు వ్యాపారులను ఆహ్వానించగా స్పందన లేదు. కొన్నిచోట్ల అధికారులు చొరవ తీసుకొని వ్యాపారులను పిలిపించి మాట్లాడినా నిష్ఫలమైంది. ప్రభుత్వ ఇంజినీరింగ్‌శాఖల ఆధ్వర్యంలో చేసిన పనులకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో గుత్తేదారులు ఇప్పటికే అష్టకష్టాలు అనుభవిస్తున్నారు. ఈ సమయంలో ఎంఐజీ హౌసింగ్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాక ప్లాట్లు విక్రయించగా వచ్చిన డబ్బు ప్రభుత్వం నుంచి తిరిగి వస్తుందో, రాదోననే అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు. ఎంఐజీ ప్రాజెక్టుల్లో ప్లాట్లు విక్రయించాక వచ్చిన మొత్తాన్ని ఎస్క్రో ఖాతాలో వేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో 96% మొత్తాన్ని వ్యాపారులకు, 3% పట్టణాభివృద్ధి సంస్థలకు, మిగిలిన 1% ప్రోగ్రాం మేనేజర్‌గా వ్యవహరించే ఏపీ పట్టణ మౌలిక సదుపాయాలు, ఆస్తుల యాజమాన్య సంస్థకు కేటాయిస్తామని ప్రకటించారు.
ని‘బంధనాలు’ అడ్డు..
ఎంఐజీ హౌసింగ్ ప్రాజెక్టులను ప్రైవేటు స్థిరాస్తి వ్యాపారుల ఆధ్వర్యంలో చేపట్టేలా ఏపీ పట్టణ మౌలిక సదుపాయాలు, ఆస్తుల యాజమాన్య సంస్థ ప్రయత్నిస్తోంది. గత రెండు మూడు నెలల్లో ఈ సంస్థ దాదాపు 18 మంది వ్యాపారులను సంప్రందించింది. తొలుత ముందుకొచ్చిన వ్యాపారులు.. ప్రభుత్వ నిబంధనలను చూసి జారుకుంటున్నారు. పట్టణాలకు సమీపంలో ఒక్కో ప్రాజెక్టుకు కనిష్ఠంగా 20 ఎకరాల భూమి ఒకేచోట ఉండాలన్న నిబంధన వారిని నిశ్చేష్టులను చేస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Turkey- syria Earthquake: అద్భుతం.. మృత్యుంజయులుగా బయటకొచ్చిన చిన్నారులు
-
India News
Cheetah: అవి పెద్దయ్యాక మనల్ని తినేస్తాయి.. మన పార్టీ ఓట్లను తగ్గించేస్తాయి..
-
Sports News
IND vs AUS: మూడో స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ని ఎంపిక చేయండి: రవిశాస్త్రి
-
Movies News
Kiara Sidharth Malhotra: ఒక్కటైన ప్రేమజంట.. ఘనంగా కియారా- సిద్ధార్థ్‌ల పరిణయం
-
Politics News
BJP: ప్రధాని మోదీపై రాహుల్ ఆరోపణలు నిరాధారం, సిగ్గుచేటు: రవిశంకర్ ప్రసాద్
-
World News
Turkey Earthquake: భూకంప విలయం.. రంగంలోకి శాటిలైట్లు!