అంతిమయాత్రలో అంతులేని కష్టాలు !

మృతదేహాన్ని మరుభూమికి తీసుకెళ్లాలంటే నీటిలోంచి మోసుకెళ్లాల్సి వస్తోంది.

Published : 03 Dec 2022 03:32 IST

దేవరాపల్లి, న్యూస్‌టుడే: మృతదేహాన్ని మరుభూమికి తీసుకెళ్లాలంటే నీటిలోంచి మోసుకెళ్లాల్సి వస్తోంది. అయినవారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబానికి ఇదో పెద్ద సమస్యగా మారింది. అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లి మండల కేంద్రానికి చెందిన ప్రధాన శ్మశానవాటిక శారదా నదికి ఆవలి ఒడ్డున ఉంది. నది దాటడానికి మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు స్థానికుల సహకారంతో గతంలో తాత్కాలికంగా కాలిబాట నిర్మించారు. ఇటీవల వరదకు అది కాస్తా కొట్టుకుపోయింది. దీంతో ప్రవాహం అధికంగా ఉన్నప్పుడు రోడ్డు పక్కనే మృతదేహాలు దహన చేసేవారు. ప్రస్తుతం వరద కొంత తగ్గడంతో అందులోంచే మృతదేహాలను మోసుకెళ్తున్నారు. నది అవతలి పొలాలకు వెళ్లాలన్నా ఈ కష్టాలు తప్పడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని