ఇదేం పాద‘పూజ’?

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల పాదాల కొలతలను ఉపాధ్యాయులు తీసుకోవాలంటూ సమగ్ర శిక్ష అభియాన్‌ ఆదేశాలు జారీ చేసింది.

Published : 03 Dec 2022 06:55 IST

విద్యార్థుల పాదాల కొలతల సేకరణ ఉపాధ్యాయుల బాధ్యతా?

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల పాదాల కొలతలను ఉపాధ్యాయులు తీసుకోవాలంటూ సమగ్ర శిక్ష అభియాన్‌ ఆదేశాలు జారీ చేసింది. వచ్చే విద్యా సంవత్సరం ఇవ్వనున్న విద్యాకానుక-4 కోసం పాదాల కొలతలు తీసుకోవాలని, వీటిని ఈనెల 12లోపు యాప్‌లో నమోదు చేయాలని సూచించింది. విద్యా కానుక కింద విద్యార్థులకు బూట్లు, సాక్సులు ఇవ్వనున్నారు. ఇందుకోసం పాదాల కొలతలు తీసుకునే బాధ్యతలను ఉపాధ్యాయులకే అప్పగించారు. బోధనేతర పనులు చేయకూడదంటూ విద్యాహక్కు చట్టం నిబంధనలు సవరించిన ప్రభుత్వం ఉపాధ్యాయులతో పాదాల కొలతలు మాత్రం తీయిస్తోంది. ఇది బోధనేతర పనుల కిందకు రాదా? అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని