రత్నా ఇన్‌ఫ్రా సంస్థలో ఈడీ సోదాలు

హైదరాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) బృందాల సోదాలు శుక్రవారం కలకలం రేపాయి. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌2లోని అశోక క్యాపిటల్‌ భవనం రెండో అంతస్తు 201 ప్లాట్‌లో ఉన్న రత్నా ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ ప్రై.లిమిటెడ్‌లో ఇవి జరిగాయి.

Updated : 03 Dec 2022 05:43 IST

వేర్‌హౌస్‌ గోదాం నిర్మాణ రుణాల్లో అక్రమాల నేపథ్యం..?

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) బృందాల సోదాలు శుక్రవారం కలకలం రేపాయి. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌2లోని అశోక క్యాపిటల్‌ భవనం రెండో అంతస్తు 201 ప్లాట్‌లో ఉన్న రత్నా ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ ప్రై.లిమిటెడ్‌లో ఇవి జరిగాయి. సంస్థకు ఎం.ఎం.ఎల్‌.నరసింహం సీఎండీగా వ్యవహరిస్తున్నారు. ఉదయమే కార్యాలయానికి చేరుకున్న ఈడీ బృందాలు రాత్రి వరకు సోదాలు నిర్వహించాయి. అవి ముగిసేవరకు సీఆర్పీఎఫ్‌ బలగాలు అక్కడే కాపుగాశాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాల్లో అక్రమాలకు సంబంధించిన వ్యవహారాలపై దర్యాప్తులో భాగంగానే ఈ సోదాలు జరిగాయి. దళితుల పేరిట రుణాలు తీసుకొని వేర్‌హౌసింగ్‌ గోదాములు కట్టారనే ఆరోపణల నేపథ్యమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. సుమారు రూ.43కోట్ల మేర చోటుచేసుకున్న అక్రమాల్లో నిధుల మళ్లింపు వ్యవహారంపై ఆరా తీస్తున్న క్రమంలోనే హైదరాబాద్‌లో సోదాలు జరిగాయని తెలుస్తోంది. ఎన్‌ఆర్‌ఐ విద్యాసంస్థల అధినేత నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్‌తో నర్సింహకు ఆర్థిక లావాదేవీలు జరిగాయనే అనుమానంతో ఈడీ బృందాలు సోదాల్లో నిమగ్నమైనట్లు సమాచారం. ఈ సందర్భంగా హార్డ్‌డిస్క్‌లు, రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత సమాచారాన్ని ఈడీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని