కృష్ణా తీరంలో జోరుగా జూదం
రాష్ట్రంలో పేకాట, జూదానికి తావులేదని.. వాటిని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించబోమని ముఖ్యమంత్రి జగన్ చెప్పే మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. అధికార పార్టీ నేతలకు పేకాట, జూద కేంద్రాలు కాసులు కురిపిస్తున్నాయి.
రేపల్లె సమీపంలో ఇసుక దిబ్బల్లో పేకాట క్లబ్బులు
వైకాపా కీలక ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులే నిర్వాహకులు
రేపల్లె అర్బన్, బాపట్ల, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పేకాట, జూదానికి తావులేదని.. వాటిని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించబోమని ముఖ్యమంత్రి జగన్ చెప్పే మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. అధికార పార్టీ నేతలకు పేకాట, జూద కేంద్రాలు కాసులు కురిపిస్తున్నాయి. ఉమ్మడి గుంటూరులో కృష్ణా నదీ పాయల్లోని ఇసుక దిబ్బలనే క్లబ్బులుగా మార్చి అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి కుటుంబీకులు పేకాట ఆడిస్తున్నారు. బాపట్ల మండలం రామ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు రిసార్టులో గతంలో జూదానికి శ్రీకారం చుట్టగానే ఆ ప్రాంత ప్రజాప్రతినిధి.. నా ఇలాకాలో వారి పెత్తనం ఏమిటని అడ్డుతగిలారు. పోలీసులు దాడి చేయగా ఓ నేత అనుచరులు రూ.లక్షల్లో నగదుతో పట్టుబడ్డారు. దీంతో వారు ఇప్పుడు రేపల్లె మండలం మోర్తోట శివారు కృష్ణా నది మధ్యన ఇసుక దిబ్బలపై జోరుగా జూదం నిర్వహిస్తున్నారు.
జూదరులకు విందు వినోదాలు
పేకాట నిర్వహణకు షామియానాలు గాలులకు పడిపోకుండా వెదురు కర్రలతో పటిష్టం చేయించారు. రాత్రివేళ అంతరాయం కలగకుండా జనరేటర్లు, బ్యాటరీల ద్వారా దీపాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల నుంచి జూదరులు కార్లలో తరలివస్తున్నారు. మోర్తోట, మైనేనివారిపాలెం తదితర గ్రామాల సమీపంలో వాహనాలు నిలిపేలా ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి నాటు పడవల ద్వారా జూదరులను అక్కడికి చేరుస్తున్నారు. వేళకు భోజనం, కోరుకున్నవారికి మద్యాన్ని నిర్వాహకులే సమకూర్చడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పేకాటరాయుళ్లు వచ్చి నాలుగైదు రోజులు ఇక్కడే మకాం వేస్తున్నారు. మూడు ముక్కలాట, కోతముక్కాట, సీక్వెన్స్ తదితర జూదం జరుగుతోంది. సగటున ఇక్కడ రోజుకు రూ.అర కోటికి పైగానే చేతులు మారుతోందంటే ఏ స్థాయిలో జూదం నడుస్తుందో అర్థమవుతోంది. రూ.లక్షల్లో నగదు పోగొట్టుకుని అప్పుల పాలై రోడ్డున పడుతున్నవారు, ఆస్తులు తాకట్టు పెట్టి ఆడుతున్నవారూ ఉన్నారు.
కోడిపందేలూ ఇతర జూదాలు సైతం..
వైకాపా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కొన్నాళ్లు మినహా కృష్ణా తీరంలో పేకాట, కోడి పందేలు నిత్యకృత్యంగా సాగుతున్నాయి. నిర్వాహకులు కొందరు చోటా నాయకులకు వారి స్థాయిని బట్టి రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు నగదు ముట్టజెప్పి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. ప్రకృతి అందాలు తిలకించడానికి పడవల్లో నదీ పాయల్లోని ద్వీపాలు, ఇసుక దిబ్బల వద్దకు పర్యాటకులు రాకుండా పేకాట క్లబ్బు నిర్వాహకులు అడ్డుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఈ ప్రాంతంలో పడవల్లో రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఇంత జరుగుతున్నా ఈ విషయాలు పోలీసులకు తెలియడం లేదా? ప్రజాప్రతినిధి కుటుంబీకుల వ్యవహారమని మిన్నకుండిపోయారా అని ప్రజలు విమర్శిస్తున్నారు. పేకాట క్లబ్బులు, కోళ్ల పందాల నిర్వహణ గురించి తెలిసినా ఎందుకొచ్చిన గొడవ అని అటుగా వెళ్లడానికి కూడా భయపడుతున్నారనీ మండిపడుతున్నారు. రేపల్లె కేంద్రంగా కొత్తగా ఇటీవల పోలీసు సబ్‌డివిజన్ ఏర్పాటైంది. అయినా అక్కడ పేకాట శిబిరాలు యథేచ్ఛగా సాగుతుండటం పోలీసుల ఉదాసీనతను తెలియజేస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Harish rao: బడ్జెట్ 2023.. అందమైన మాటలు తప్ప కేటాయింపుల్లేని డొల్ల బడ్జెట్: హరీశ్‌రావు
-
General News
Taraka Ratna: తారకరత్న మెదడుకు సంబంధించిన చికిత్స జరుగుతోంది: విజయసాయిరెడ్డి
-
India News
Budget 2023: సరిహద్దులకు మరింత ‘రక్షణ’.. అగ్నివీరులకు ‘పన్ను’ ఊరట
-
General News
Top 10 Budget Stories: కేంద్ర బడ్జెట్ - 2023 ప్రత్యేక కథనాలు!
-
Sports News
IND vs NZ: అతి పెద్ద స్టేడియంలో.. అత్యంత కీలక పోరుకు వేళాయె..!
-
Politics News
Pawan: భూమి, ఇసుక, మద్యం నుంచి గనుల వరకు వచ్చే ప్రతి పైసా జగన్ చేతిలోనే: పవన్