విద్యార్థులకు అందని గోరుముద్ద

అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలోని సూగేపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మూడు రోజుల పాటు మధ్యాహ్నం భోజనం లేక విద్యార్థులు అవస్థలు పడ్డారు. కొందరు ఇంటినుంచి తెచ్చుకోగా.. మరి కొందరు ఇళ్లకు వెళ్లి భోజనం చేశారు.

Published : 04 Dec 2022 04:39 IST

సూగేపల్లి(బ్రహ్మసముద్రం), న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలోని సూగేపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మూడు రోజుల పాటు మధ్యాహ్నం భోజనం లేక విద్యార్థులు అవస్థలు పడ్డారు. కొందరు ఇంటినుంచి తెచ్చుకోగా.. మరి కొందరు ఇళ్లకు వెళ్లి భోజనం చేశారు. ఇక్కడ 1నుంచి 5వ తరగతి వరకు 45మంది విద్యార్థులు చదువుతున్నారు. మెనూ ప్రకారం భోజనం తయారు చేస్తే తమకు గిట్టుబాటు కాదంటూ ఏజెన్సీ నిర్వాహకులు ఈ నెల ఒకటో తేదీ నుంచి వంట చేయడం మానేశారు. ఇదే విషయాన్ని పదిహేను రోజుల కిందటే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దృష్టికి తీసుకెళ్లామని, కొత్తవారిని ఏర్పాటు చేసుకోవాలని చెప్పినా ఆయన స్పందించలేదని ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు. ప్రత్యామ్నాయంగా కొత్తవారిని ఏర్పాటు చేసి ఉంటే మూడు రోజులు భోజనానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది కాదని, ప్రధానోపాధ్యాయుడి నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి నెలకొందని తల్లిదండ్రులు వాపోయారు. ప్రధానోపాధ్యాయుడు కృష్ణ మాట్లాడుతూ సోమవారం నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని