ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందానికి అస్వస్థత

వైయస్‌ఆర్‌ జిల్లా పార్నపల్లిలో శుక్రవారం జరిగిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు బందోబస్తుగా వెళ్లిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం తిరుగు ప్రయాణంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యింది. సిబ్బంది విధులు ముగించుకుని కర్నూలుకు బయల్దేరారు.

Published : 04 Dec 2022 04:18 IST

కలుషిత ఆహారమే కారణం

తాడిపత్రి, న్యూస్‌టుడే: వైయస్‌ఆర్‌ జిల్లా పార్నపల్లిలో శుక్రవారం జరిగిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు బందోబస్తుగా వెళ్లిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం తిరుగు ప్రయాణంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యింది. సిబ్బంది విధులు ముగించుకుని కర్నూలుకు బయల్దేరారు. అర్ధరాత్రి వారు అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ పరిసరాల్లోకి రాగానే 30 మందికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. సిబ్బంది భయాందోళనకు గురై వెంటనే పట్టణంలోని వైద్య విధాన ఆసుపత్రికి వచ్చి చికిత్స చేయించుకున్నారు. సీఎం కార్యక్రమంలో మధ్యాహ్నం వెజిటేబుల్‌ పలావ్‌ తిన్నామని సిబ్బంది తెలిపారు. కలుషిత ఆహారం తినడం వల్లే వారు అస్వస్థతకు గురయ్యారని వైద్యులు నిర్ధారించారు. 25 మందికి చికిత్స చేసి పంపించినట్లు తెలిపారు. అస్వస్థతకు గురైన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని తాడిపత్రి డీఎస్పీ వీఎన్‌కే చైతన్య పరామర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని