కత్తి బెదిరేలా కంద!

సాధారణంగా ఒక కంద 4 కిలోల నుంచి 5 కిలోల వరకు పెరుగుతుంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ నాలుగో వార్డుకు చెందిన కొండవీటి రామ్‌ప్రసాద్‌ తోటలో ఓ దుంప 20 కిలోల వరకు ఊరింది.

Published : 04 Dec 2022 04:18 IST

20 కిలోలు ఊరిన దుంప

సాధారణంగా ఒక కంద 4 కిలోల నుంచి 5 కిలోల వరకు పెరుగుతుంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ నాలుగో వార్డుకు చెందిన కొండవీటి రామ్‌ప్రసాద్‌ తోటలో ఓ దుంప 20 కిలోల వరకు ఊరింది. ఏడాది కిందట వేసిన తోటలో మిగతా మొక్కలు సాధారణంగానే దిగుబడి ఇచ్చాయి. ఒక్కటి మాత్రమే ఇలా భారీ దుంపను వేసింది. ఇంతలా ఊరడం చాలా అరుదని, భూసారం ఎక్కువ ఉండటం వల్ల ఇలా పెరిగి ఉండొచ్చని వ్యవసాయాధికారిణి శౌరమ్మ తెలిపారు.

న్యూస్‌టుడే, అవనిగడ్డ

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు