ఇదీ.. స్మార్ట్‌ టౌన్‌షిప్పే!

సీఆర్‌డీఏ అధికారులు గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నవులూరు వద్ద మధ్య ఆదాయ వర్గాల (ఎంఐజీ) వారి కోసం జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ ఏర్పాటు చేశారు.

Published : 04 Dec 2022 04:54 IST

సీఆర్‌డీఏ అధికారులు గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నవులూరు వద్ద మధ్య ఆదాయ వర్గాల (ఎంఐజీ) వారి కోసం జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ ఏర్పాటు చేశారు. చదరపు గజం రూ.17,499 ధరతో రెండు విభాగాల్లో 267 ప్లాట్లు విక్రయానికి పెట్టారు. లేఅవుట్‌లో రోడ్లు, విద్యుత్తు, మురుగు కాలువల వ్యవస్థ, ఉద్యానాలు తదితర వసతులన్నీ కల్పిస్తామని హామీ ఇచ్చారు. హద్దు రాళ్లు నాటారు. ఒక్క పనీ చేపట్టకుండా వదిలేశారు. ఇప్పడది ముళ్ల చెట్లు పెరిగి అడవిని తలపిస్తోంది. కనీసం హద్దు రాళ్లూ కనిపించని దుస్థితి నెలకొంది.

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని