CM Jagan-Chandrababu: నేడు దిల్లీకి జగన్, చంద్రబాబు
ఏపీ సీఎం జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబు సోమవారం వేర్వేరుగా దిల్లీ వెళ్లనున్నారు.
గన్నవరం నుంచి సీఎం.. శంషాబాద్ నుంచి ప్రతిపక్ష నేత ప్రయాణం
జీ20 సదస్సు నిర్వహణపై అఖిలపక్ష సమావేశానికి..
ఈనాడు డిజిటల్, అమరావతి: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు సోమవారం వేర్వేరుగా దిల్లీ వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జీ20 సదస్సు నిర్వహణపై సోమవారం సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు రాష్ట్రపతి భవన్లో జరిగే అఖిలపక్ష సమావేశంలో వీరు పాల్గొంటారు. సీఎం జగన్ మధ్యాహ్నం 12.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 3.15 గంటలకు దిల్లీ చేరుకుంటారు. అఖిలపక్ష సమావేశంలో పాల్గొని, రాత్రి 7.55 గంటలకు దిల్లీ నుంచి తాడేపల్లి తిరుగు ప్రయాణమవుతారు. మరోవైపు తెదేపా అధినేత చంద్రబాబు సోమవారం ఉదయం 9:30 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరి 12:40కి దిల్లీ చేరుకుంటారు. సాయంత్రం అఖిలపక్ష సమావేశంలో పాల్గొంటారు.
రేపు కడపలో సీఎం పర్యటన
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మంగళవారం కడపలో పర్యటించనున్నారు. 6న ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి కడప వెళ్లనున్నారు. కడప అమీన్‌పీర్ దర్గాలో పెద్ద ఉర్సు ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. మధ్యాహ్నం కడప నుంచి బయల్దేరి తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Cow Hug day: ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే కాదు.. కౌ హగ్ డే..!
-
World News
Operation Dost: విభేదాలున్నా.. తుర్కియేకు భారత్ ఆపన్నహస్తం..!
-
Movies News
Social Look: రుహానీ శర్మ రెడ్ రోజ్.. ప్రణీతకు బోర్ కొడితే?
-
General News
Andhra News: సీబీఐ విచారణ కోరుతూ రఘురామ పిటిషన్.. కేంద్రం, సీబీఐకి నోటీసులు జారీ
-
Movies News
Dhanush: ఈ రోజు నాకెంతో ప్రత్యేకం: ధనుష్
-
Sports News
IND vs AUS: గిల్, సూర్యకుమార్.. ఇద్దరిలో ఎవరు? రోహిత్ ఏమన్నాడంటే?