పదవులకు వన్నె తెచ్చిన రోశయ్య

దివంగత మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య తాను చేపట్టిన పదవులన్నింటికీ వన్నెతెచ్చారని శాసనసభ ఉపసభాపతి వీరభద్రస్వామి కొనియాడారు.

Published : 05 Dec 2022 03:28 IST

విగ్రహావిష్కరణ సభలో ఉప సభాపతి వీరభద్రస్వామి

వేమూరు, న్యూస్‌టుడే: దివంగత మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య తాను చేపట్టిన పదవులన్నింటికీ వన్నెతెచ్చారని శాసనసభ ఉపసభాపతి వీరభద్రస్వామి కొనియాడారు. రోశయ్య స్వస్థలమైన బాపట్ల జిల్లా వేమూరులో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీరభద్రస్వామి మాట్లాడుతూ రోశయ్య విగ్రహం ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆయన వల్లే ఆర్యవైశ్యులకు తగిన గుర్తింపు లభించిందని చెప్పారు. రాష్ట్ర ప్రజలతో పాటు, ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నాగార్జున మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అరుదైన నాయకుడు రోశయ్య అని కొనియాడారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వేమూరులో విగ్రహం ఏర్పాటు చేశామన్నారు. నేటి తరం రాజకీయ నాయకులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లిన వ్యక్తి రోశయ్య అని అభివర్ణించారు. రోశయ్య పెద్దకుమారుడు శివసుబ్బారావు, ఎమ్మెల్యేలు మద్దాళి గిరి, అన్నాబత్తిన శివకుమార్‌, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కె.ప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యే మల్లికార్జునరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని