Andhra News: సీమెన్స్ ప్రాజెక్టు కేసులో నిందితులకు ఈడీ నోటీసులు
ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సీమెన్స్ ప్రాజెక్టుకు సంబంధించి రూ.241 కోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయన్న ఆరోపణలపై ఏపీ సీఐడీ గతేడాది డిసెంబరులో నమోదు చేసిన కేసులో నిందితులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులిచ్చింది.
హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో విచారణకు రావాలని ఆదేశం
ఈనాడు-అమరావతి: ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సీమెన్స్ ప్రాజెక్టుకు సంబంధించి రూ.241 కోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయన్న ఆరోపణలపై ఏపీ సీఐడీ గతేడాది డిసెంబరులో నమోదు చేసిన కేసులో నిందితులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులిచ్చింది. హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. నైపుణ్యాభివృద్ధి సంస్థ మాజీ ప్రత్యేక కార్యదర్శి గంటా సుబ్బారావు, ఆయన ఓఎస్డీ నిమ్మగడ్డ వెంకట కృష్ణప్రసాద్, మాజీ డైరెక్టర్ డాక్టర్ కె.లక్ష్మీనారాయణ, డిజైన్‌టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్.. పుణె, స్కిలర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. ముంబయి, సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్ సహా మొత్తం 26 మంది వ్యక్తులు, సంస్థలు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. వారికి ఈడీ దశలవారీగా నోటీసులిస్తోంది.
నకిలీ ఇన్వాయిస్లతో మోసం
పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలపై విద్యార్థులు, యువతకు శిక్షణనివ్వడానికి ఆరు నైపుణ్య క్లస్టర్ల ఏర్పాటుకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌లు గత ప్రభుత్వ హయాంలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒక్కో నైపుణ్య క్లస్టర్ ఏర్పాటుకు రూ.546.84 కోట్లు ఖర్చవుతుందని.. అందులో 90 శాతం సీమెన్స్ సంస్థ గ్రాంట్ఇన్ ఎయిడ్ కింద చెల్లిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద 10 శాతం భరించాలనేది ఈ ఒప్పందం సారాంశం. రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద చెల్లించిన రూ.371 కోట్లలో రూ.241 కోట్లు డొల్ల కంపెనీలైన స్కిలర్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎలైడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ (ఆసియా) లిమిటెడ్, పత్రిక్ ఇన్ఫో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఐటీ స్మిత్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్‌వెబ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, నాలెడ్జ్ పోడియం, టాలెండ్ ఎడ్జ్ సంస్థల్లోకి మళ్లించారన్న ఆరోపణలపై సీఐడీ గతంలో కేసు నమోదు చేసింది. సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ (ఇండియా ప్రైవేట్ లిమిటెడ్), డిజైన్‌టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి రూ.241.78 కోట్లు కొల్లగొట్టాయని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. స్కిలర్ ఎంటర్‌ప్రైజస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి సింగపూర్‌కు, అక్కడినుంచి ఆప్టస్ హెల్త్‌కేర్ (ఇండియా) లిమిటెడ్‌కు నిధులు హవాలా మార్గంలో వచ్చాయని సీఐడీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో నిందితులను ఈడీ విచారించనుంది.
సీఐడీ నమోదు చేసిన కేసులో నిందితులు వీరే..
* గంటా సుబ్బారావు, నైపుణ్యాభివృద్ధి సంస్థ మాజీ ప్రత్యేక కార్యదర్శి
* డాక్టర్ కె.లక్ష్మీనారాయణ, నైపుణ్యాభివృద్ధి సంస్థ మాజీ డైరెక్టర్
* నిమ్మగడ్డ వెంకటకృష్ణప్రసాద్, గంటా సుబ్బారావు ఓఎస్డీ
* డిజైన్‌టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, పుణె
* స్కిలర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ముంబయి
* సౌమ్యాద్రి శేఖర్ బోస్, ఎండీ, సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్
* ప్రతాప్‌కుమార్ కర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ
* వికాస్ వినాయక్ ఖన్వేల్కర్, సీఎండీ, డిజైన్‌టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, పుణె
* సంజయ్ దగ, ప్రెసిడెంట్, డిజైన్‌టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, పుణె
* ముకుల్ అగర్వాల్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, స్కిలర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
* సౌరభ్గార్గ్, ఎండీ, స్కిలర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
* హిర్జి కంజి పటేల్, ఎండీ, ఎల్లైడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్
* శిరీష్ చంద్రకాంత్ షా, కీ అడ్మినిస్ట్రేటర్, ఎల్లైడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్
* పత్రిక్ ఇన్ఫో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఐటీ స్మిత్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్‌వెబ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, నాలెడ్జ్ పోడియం, టాలెంట్ ఎడ్జ్ సంస్థల డైరెక్టర్లు
* సౌమ్యాద్రి శేఖర్ బోస్‌కు సంబంధించిన సీమెన్స్ ప్రాజెక్ట్ బృంద సభ్యులు
* సురేష్ గోయల్, దిల్లీ
* మనోజ్‌కుమార్ జైన్, దిల్లీ
* సౌరభ్గుప్తా, గురుగ్రామ్
* విపిన్ శర్మ, దిల్లీ
* సవాంగ్‌కుమార్ తొలరామ్ జాజు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Rishi Sunak: రిషి సునాక్ 100 రోజుల ప్రతిన..
-
Crime News
Andhra News: వాగులో దూకి నిందితుడి పరారీ.. పోలీసులు గాలించినా లభించని ఆచూకీ
-
Movies News
K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
General News
Telangana News: కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!