ఈడీవి సాధారణ తనిఖీలే: రత్నా ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నం.2లోని తమ సంస్థలో ఈ నెల 2న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) బృందం నిర్వహించినవి సాధారణ తనిఖీలే అని రత్నా ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ నిర్వాహకులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated : 05 Dec 2022 05:19 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నం.2లోని తమ సంస్థలో ఈ నెల 2న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) బృందం నిర్వహించినవి సాధారణ తనిఖీలే అని రత్నా ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ నిర్వాహకులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఈడీ అధికారులకు తమ సంస్థ సిబ్బంది పూర్తిగా సహకరించడంతోపాటు అవసరమైన సమాచారాన్ని అందజేశారని వివరించారు. గోదావరి జిల్లాల్లో దళితుల పేరిట తీసుకున్న రుణాలతో గోదాములు నిర్మించిన వ్యవహారంతో తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ‘‘ఎన్‌ఆర్‌ఐ విద్యాసంస్థలో భవనాలు నిర్మించేందుకు ఆ సంస్థ నిర్వాహకులు తమకు కొంత అడ్వాన్సు చెల్లించారు. కొన్ని అనివార్య కారణాలతో ఆ నిర్మాణాలు చేపట్టలేకపోయాం. ఆ సంస్థ అధినేత నిమ్మగడ్డ ఉపేంద్రతో తమకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవు’’ అని రత్నా ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ నిర్వాహకులు వివరణ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని