ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం

అగ్రవర్ణ పేదలకు 10శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రధాన రాజకీయ పార్టీలు స్వాగతించడం అగ్రకులాల పక్షపాతమేనని ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు విమర్శించారు.

Published : 05 Dec 2022 03:28 IST

ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు

విజయవాడ (గాంధీనగర్‌), న్యూస్‌టుడే: అగ్రవర్ణ పేదలకు 10శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రధాన రాజకీయ పార్టీలు స్వాగతించడం అగ్రకులాల పక్షపాతమేనని ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు విమర్శించారు. ఆదివారం విజయవాడలో నిర్వహించిన బీసీ సంఘాల రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని రాజకీయ పక్షాలు బీసీలను ఓటుబ్యాంకుగా చూస్తూ మోసం చేస్తున్నాయని శంకర్రావు మండిపడ్డారు. సమాజంలో 85 శాతం ఉన్న బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతుంటే ఏ ఒక్క పార్టీ ప్రశ్నించకపోవడం దారుణమన్నారు. ఈడబ్ల్యూఎస్‌ 10 శాతం రిజర్వేషన్లపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. 2024 ఎన్నికల్లో రాజ్యాధికారం సాధించేలా బీసీ సంఘాలన్నీ ఐక్యంగా కృషి చేయాలని మాజీ న్యాయమూర్తి సంజీవయ్య పిలుపునిచ్చారు. కేంద్రం బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఎందుకు కల్పించడం లేదని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసగౌడ్‌ ప్రశ్నించారు. బీసీల కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేశారు. ఏపీలో ముఖ్యమంత్రి జగన్‌ బీసీలను నమ్మించి మోసం చేశారని విమర్శించారు. రిజర్వేషన్లపై కేంద్రం స్పందించకపోతే పార్లమెంటును ముట్టడిస్తామని బీసీ సంఘం నాయకులు హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కోదాడ రాజయ్య, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి హరికుమార్‌, సంఘం నాయకులు క్రాంతికుమార్‌, అన్నవరపు నాగమల్లిరాజు, తన్నీరు ఆంజనేయులు, డాక్టర్‌ శేషయ్య, కనకారావు, ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు