ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లో జూదశాల

ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో శ్రీసిటీకి సమీపంలో నిర్వహిస్తున్న జూదశాల పారిశ్రామిక వాతావరణాన్ని దెబ్బతీస్తున్నట్లు స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Published : 05 Dec 2022 03:28 IST

సూళ్లూరుపేట అధికార పార్టీ నేత అనుచరుల నిర్వహణ

తిరుపతి, న్యూస్‌టుడే: ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో శ్రీసిటీకి సమీపంలో నిర్వహిస్తున్న జూదశాల పారిశ్రామిక వాతావరణాన్ని దెబ్బతీస్తున్నట్లు స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తిరుపతి జిల్లా సత్యవేడుకు సమీపంలో, తమిళనాడు రాష్ట్రం ఆరంబాకం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఎగుమదురై పల్లెలో పేకాట, ఇతర నిషేధిత కార్యకలాపాలు సాగుతున్నాయి. జాతీయ రహదారికి దూరంగా ఉన్న ఈ పల్లెలో విశాలమైన స్థలంలో వందల వాహనాలు బారులు తీరుతున్నాయి. సాధారణ రోజుల్లో రూ.లక్షల్లో, ఆదివారం రూ.కోట్లలో చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడికి వచ్చి సొమ్ము పోగొట్టుకున్న ధనవంతులెందరో ఆస్తులు తెగనమ్ముకుంటున్న ఉదంతాలు విన్పిస్తున్నాయి. ఈ జూదశాల వెనుక సూళ్లూరుపేట ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నేత అనుచరుల హస్తమున్నట్లు  ఆరోపణలు వస్తున్నాయి. నిర్వాహకుల మనుషులు పరిసరాల్లో నిఘావేసి, అనుమతి ఉన్నవారినే రానిస్తున్నారు. పారిశ్రామిక వాతావరణానికి భంగం వాటిల్లుతోందంటూ 3 రోజుల కిందట శ్రీసిటీ సెక్యూరిటీ సిబ్బంది జూదం నిర్వహణను అడ్డుకునేందుకు యత్నించడంతో ఇరువర్గాల నడుమ వాగ్వాదం జరిగింది. ఈ విషయం చిత్తూరు జిల్లాకు చెందిన వైకాపా నేత దృష్టికి తీసుకెళ్లడంతో ఆరా తీస్తున్నట్లు సమాచారం.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు