రాతి శిలలకు జీవం పోసినట్లుగా..!

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి శివారుపల్లె రావులపల్లిలో ఉన్న పాండవుల గుట్టలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Updated : 05 Dec 2022 04:37 IST

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి శివారుపల్లె రావులపల్లిలో ఉన్న పాండవుల గుట్టలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పాండవుల కాలంలో చెట్ల పసరుతో వేసిన వివిధ రకాల బొమ్మలు ఇక్కడ కనిపిస్తాయి. కొండపైన పాము పడగ ఆకారంలో ప్రధాన గుహ కనిపిస్తుంది. ఏనుగు ఆకారం, శంఖం ఆకారంలో ఉన్న గుహలు దర్శనమిస్తాయి. పాండవులు హోమాలు, యజ్ఞాలు చేసిన ఆనవాళ్లున్నాయి. కొంచెం దిగువ భాగంలోకి వెళ్తే కుంతీ గుహ, పక్కనే బండల మధ్య నీటి ఊట ఉంటుంది. గుహలు, ప్రకృతి అందాలను తిలకించడానికి పర్యాటకులు నిరంతరం వస్తుంటారు.

ఈనాడు హనుమకొండ; న్యూస్‌టుడే, రేగొండ

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు