వక్ఫ్‌ చట్టాలకు విరుద్ధంగా బోర్డు ఛైర్మన్‌ వ్యవహారం

వక్ఫ్‌ చట్టాలు, నిబంధనలకు విరుద్ధంగా ఏపీ వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌ ఖాదర్‌ బాషా వ్యవహరిస్తున్నారని ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ నాగుల్‌ మీరా ఆరోపించారు.

Published : 05 Dec 2022 04:35 IST

ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి ఆరోపణ 

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వక్ఫ్‌ చట్టాలు, నిబంధనలకు విరుద్ధంగా ఏపీ వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌ ఖాదర్‌ బాషా వ్యవహరిస్తున్నారని ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ నాగుల్‌ మీరా ఆరోపించారు. చివరికి వక్ఫ్‌ బోర్డు ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితికి బోర్డును తీసుకొచ్చారని విమర్శించారు. ఈ మేరకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శికి ఆదివారం ఆయన లేఖ రాశారు. ‘‘న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నా నిబంధనలకు విరుద్ధంగా కమిటీలు నియమిస్తున్నారు. అన్యాక్రాంతమైన వక్ఫ్‌ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఏ మాత్రం ప్రయత్నించడం లేదు. ఆక్రమణదారులకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని