వలస పక్షులకు చెత్త విడిది!

గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రానికి ఏటా విదేశీ విహంగాలు వచ్చి సందడి చేస్తాయి.

Published : 05 Dec 2022 04:35 IST

గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రానికి ఏటా విదేశీ విహంగాలు వచ్చి సందడి చేస్తాయి. వీటిని చూసేందుకు ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు. అలాంటి కేంద్రాన్ని ఎంతో శుభ్రంగా ఉంచాల్సింది పోయి.. దాని ముఖద్వారాన్ని చెత్తతో నింపేస్తున్నారు. ఊళ్లో సేకరించిన చెత్తనంతా తెచ్చి,రోడ్డ పక్కనే చెరువు గట్టున పోస్తున్నారు. వ్యర్థాల నుంచి వచ్చే దుర్వాసనతో పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. అందులోని కవర్లు గాలికి వచ్చి చెరువులో పడుతున్నాయి.    

 ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు