రాజకీయాలకు అతీతంగా ముందుకెళ్లాలి

జీ-20 అధ్యక్ష పదవిని భారత్‌ చేపట్టిన నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం మనవైపే చూస్తుందని, అందువల్ల పార్టీలకు అతీతంగా అందరూ ఏకతాటిపైకి రావాలని సీఎం జగన్‌ సూచించారు.

Updated : 06 Dec 2022 07:54 IST

అంతర్జాతీయ సమాజం మనవైపు చూస్తుందని గుర్తెరగాలి

జీ20కి సంబంధించి మాకు ఏ బాధ్యత అప్పగించినా సిద్ధమే

ముఖ్యమంత్రి జగన్‌

ఈనాడు, దిల్లీ: జీ-20 అధ్యక్ష పదవిని భారత్‌ చేపట్టిన నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం మనవైపే చూస్తుందని, అందువల్ల పార్టీలకు అతీతంగా అందరూ ఏకతాటిపైకి రావాలని సీఎం జగన్‌ సూచించారు. రాజకీయ పార్టీల మధ్య విభేదాలు సహజమని, వాటిని మనవరకే పరిమితం చేసుకుని సదస్సు విజయవంతానికి కలిసికట్టుగా ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం దిల్లీలో జరిగిన జీ-20 సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. జీ-20 దేశాధినేతల ప్రతిష్ఠాత్మక సదస్సుకు భారత్‌ వేదిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి ఆయన అభినందనలు తెలియజేశారు. జీ-20 సదస్సు ఏర్పాట్లు, అందుకు సంబంధించిన సన్నాహకాల్లో ఎలాంటి బాధ్యతను ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించినా నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని జగన్‌ చెప్పారు. సదస్సు విజయవంతమయ్యేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. జీ-20 అధ్యక్ష పదవిని భారత్‌ చేపట్టిన సందర్భంలో రాజకీయ కోణంలో వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని