ట్రై అథ్లాన్‌లో సత్తా చాటిన గుంటూరు ఐజీ త్రివిక్రమ్‌ వర్మ

పోలీసు అధికారుల ఫిట్‌నెస్‌ను పరీక్షించేందుకు హైదరాబాద్‌లోని జాతీయ పోలీసు అకాడమీ నిర్వహించిన ట్రై అథ్లాన్‌ పోటీల్లో గుంటూరు రేంజి ఐజీ సీహెచ్‌.త్రివిక్రమ్‌ వర్మ సత్తా చాటారు.

Published : 06 Dec 2022 04:16 IST

ఈనాడు-అమరావతి: పోలీసు అధికారుల ఫిట్‌నెస్‌ను పరీక్షించేందుకు హైదరాబాద్‌లోని జాతీయ పోలీసు అకాడమీ నిర్వహించిన ట్రై అథ్లాన్‌ పోటీల్లో గుంటూరు రేంజి ఐజీ సీహెచ్‌.త్రివిక్రమ్‌ వర్మ సత్తా చాటారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఐపీఎస్‌ అధికారులు పాల్గొన్న ఈ పోటీల్లో ఆయన విజేతగా నిలిచారు. ఒక కిలోమీటరు స్విమ్మింగ్‌, 40 కిలోమీటర్ల సైక్లింగ్‌, 10 కిలోమీటర్ల రన్నింగ్‌ ఈవెంట్లను నిర్దేశిత సమయం కంటే ముందే పూర్తి చేశారు. ఈ సందర్భంగా పలువురు ఐపీఎస్‌ అధికారులు ఆయనను అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని