నూతన వైద్య కళాశాలల నిర్మాణానికి సహకరించండి

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నిర్మిస్తున్న వైద్య కళాశాలలకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ మన్‌సుఖ్‌ మాండవీయకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని విజ్ఞప్తి చేశారు.

Published : 06 Dec 2022 05:02 IST

కేంద్ర మంత్రి మాండవీయకు రాష్ట్ర మంత్రి రజిని వినతి

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నిర్మిస్తున్న వైద్య కళాశాలలకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ మన్‌సుఖ్‌ మాండవీయకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని దిల్లీలో సోమవారం ఆమె కలిశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఇచ్చిన పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్లలో కళాశాలల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. ప్రతి జిల్లాలో కనీసం ఒక వైద్య కళాశాల ఉండేలా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకున్నారని, ఇప్పటికే అన్ని చోట్లా వాటి నిర్మాణం ప్రారంభమైందన్నారు. కొత్తగా నిర్మిస్తున్న 17 కళాశాలలకు తగిన ఆర్థిక సహాయాన్ని అందజేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అనంతరం వివిధ అంశాలపై ఆమె కేంద్ర మంత్రికి వినతిపత్రాలు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని