నీతి లేని ఓ నాయకుడా..! పలుకులేని పరిపాలకుడా..!
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల ఇబ్బందులపై అనంతపురం జిల్లాకు చెందిన విశ్రాంత ఉద్యోగి బాల ఎర్రిస్వామి రాసిన పాట ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
సీఎం జగన్ పాలనపై విశ్రాంత ఉపాధ్యాయుడి పాట
సామాజిక మాధ్యమాల్లో వైరల్
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల ఇబ్బందులపై అనంతపురం జిల్లాకు చెందిన విశ్రాంత ఉద్యోగి బాల ఎర్రిస్వామి రాసిన పాట ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సకాలంలో జీతాలు అందని దుస్థితి.. ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా సీఎం జగన్ ఇచ్చిన హామీలు, పెండింగ్ సమస్యలపై ఆయన పాట రాసి, ఆలపించారు. ‘నీతి లేని ఓ నాయకుడా.. పలుకులేని పరిపాలకుడా’ అంటూ ఉద్యోగుల ఇబ్బందులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ పాట రూపంలో ఏకరువు పెట్టారు. ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా సీఎం జగన్ ఇచ్చిన హామీలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరును ఆ పాటలో ఎండగట్టారు. నవంబరు జీతం డిసెంబరు ఐదో తేదీ వచ్చినా అందకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ సమయంలో ఆయన రాసిన ఈ పాటకు ఉద్యోగుల నుంచి ఆదరణ లభిస్తోంది.
ఏన్నాళ్లీ వేదనలోయీ..
విసిగిపోయే వేతన జీవి..
నవ్యాంధ్ర పాలనలోన నలుగుతున్న బతుకులు మావి
నీతి లేని ఓ నాయకుడా..!
పలుకులేని పరిపాలకుడా..!
మా రోదన వినపడలేదా? ఆక్రందన అగుపడలేదా?
ఈ రోదన వినపడలేదా? ఆక్రందన అగుపడలేదా?
(ఎన్నాళ్లీ వేదనలోయీ)
సుద్దులు చెప్పి..
సీపీఎస్ రద్దని ఒప్పి..
ఉద్యోగులకాశల పెంచి..
మాటలతో మైమరిపించి..
నీతిలేని ఓ నాయకుడా.. పలుకులేని పరిపాలకుడా..
(ఎన్నాళ్లీ వేదనలోయీ)
బకాయిలు ఉట్టిన పెట్టి
ఉద్యోగుల పొట్టను కొట్టి
పీఆర్సీ పట్టీ పట్టీ
క్షణ క్షణము నరకము పెట్టీ
నీతిలేని ఓ నాయకుడా.. పలుకులేని పరిపాలకుడా..
(ఎన్నాళ్లీ వేదనలోయీ)
కరవు భత్యం కలలే ఆయే..
వాయిదాల పాలైపాయే..
అరియర్సులే ఆగమే ఆయే..
ఆందోళన బతుకైపాయే
నీతిలేని ఓ నాయకుడా.. పలుకులేని పరిపాలకుడా..
(ఎన్నాళ్లీ వేదనలోయీ)
వేతనాల సవరణ లేక..
సకాలంలో అమలుకు రాక
ఆర్థికంగా అర్హత పోయి..
కుములిపోయే పెన్షన్ జీవి
నీతిలేని ఓ నాయకుడా.. పలుకులేని పరిపాలకుడా..
(ఎన్నాళ్లీ వేదనలోయీ)
కాలమెంత కష్టం తెెచ్చే
కరుణలేని పాలన దెచ్చే
ఉద్యోగికి వ్యథలను తెచ్చే..
రోడ్ల మీదకు బతుకులు వచ్చే..
నీతిలేని ఓ నాయకుడా.. పలుకులేని పరిపాలకుడా..
(ఎన్నాళ్లీ వేదనలోయీ)
ఉద్యోగి హాయిగా బతికే
ఆ నవయుగమదెంత దూరమో
ధర్నాలు, సమ్మెలు అంటూ
కనిపించని కాలాలెపుడో
నీతి మీద మాటకు నిలబడి
పాలించే నాయకుడెవరో
అంతవరకు ఇంతేెనన్నా
మన బతుకులకు చింతేనన్నా..
ఏన్నాళ్లీ వేదనలోయీ..
విసిగిపోయే వేతన జీవి..
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Sameera Reddy: మహేశ్‌బాబు సినిమా ఆడిషన్.. ఏడ్చుకుంటూ వచ్చేశా: సమీరారెడ్డి
-
India News
ఘోరం.. వ్యాధి తగ్గాలని 3 నెలల చిన్నారికి 51 సార్లు కాల్చి వాతలు..!
-
Movies News
OTT Movies: డిజిటల్ తెరపై మెరవనున్న బాలీవుడ్ తారలు
-
Politics News
Bhuma Akhila Priya: ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. భూమా అఖిలప్రియ గృహ నిర్బంధం
-
Crime News
Hyderabad: రామంతపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
World News
Vladimir Putin: రష్యాను ఎదుర్కోవడం సులువు కాదు..: పుతిన్