పంచాయతీరాజ్‌ సలహాదారుగా నాగార్జునరెడ్డి

ముఖ్యమంత్రి జగన్‌ సొంత జిల్లా వైయస్‌ఆర్‌లోని పోరుమామిళ్లకు చెందిన పోతిరెడ్డి నాగార్జునరెడ్డిని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ సలహాదారుగా నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసింది.

Published : 07 Dec 2022 03:50 IST

ఆయనదీ వైయస్‌ఆర్‌ జిల్లాయే

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ సొంత జిల్లా వైయస్‌ఆర్‌లోని పోరుమామిళ్లకు చెందిన పోతిరెడ్డి నాగార్జునరెడ్డిని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ సలహాదారుగా నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసింది. వైకాపా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ఆయన గతంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో నాగార్జునరెడ్డి తల్లి కృష్ణమ్మ ఏపీ ఆర్థిక సంస్థ ఛైర్మన్‌గా పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రత్యేక ఆహ్వానితునిగా నాగార్జునరెడ్డిని ప్రస్తుత ప్రభుత్వం గతంలో నియమించింది. హైకోర్టు ఈ నియామకాన్ని తప్పుపట్టడంతో అప్పట్లో తొలగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని