23, 24న తేదీల్లో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

విజయవాడ పీబీ సిద్దార్థ డిగ్రీ కళాశాల ఆవరణలో ఈ నెల 23, 24 తేదీల్లో 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను నిర్వహించనున్నారు.

Updated : 07 Dec 2022 03:58 IST

దేశ, విదేశాల నుంచి 1,300 మంది పేర్ల నమోదు: మండలి బుద్ధప్రసాద్‌

విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే: విజయవాడ పీబీ సిద్దార్థ డిగ్రీ కళాశాల ఆవరణలో ఈ నెల 23, 24 తేదీల్లో 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను నిర్వహించనున్నారు. కృష్ణా జిల్లా తెలుగు రచయితల సంఘం సహకారంతో ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ సభలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సంఘం గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ మండలి బుద్ధప్రసాద్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రెండు సంఘాల ఆధ్వర్యంలో 2007, 2011, 2015, 2019 సంవత్సరాల్లోనూ ప్రపంచ మహాసభలను ఘనంగా నిర్వహించినట్లు ఆయన గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో ప్రస్తుత సభలనూ విజయవంతం చేస్తామన్నారు. మారుతున్న దేశ, కాలమాన పరిస్థితుల్లో తెలుగు భాష, సంస్కృతి, చరిత్ర, సామాజిక రంగాల అభివృద్ధిలో రచయితల పాత్ర, కర్తవ్యం, కార్యాచరణ లక్ష్యాలుగా సభల్లో సాహితీవేత్తల సమక్షంలో సదస్సులు, చర్చలు ఉంటాయన్నారు.  ఇప్పటికే దేశ, విదేశాల నుంచి 1,300 మందికిపైగా తెలుగు రచయితలు పేర్లు నమోదు చేసుకున్నారని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని