ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెడితే మంచిదనే చెప్పా

‘రైతులు వరి పండిస్తే కొనడానికి ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. సాగు ఎవరికీ భారం కాకూడదు అన్నాను. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందేందుకు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టిపెడితే మంచిదన్న నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు’ అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు.

Published : 07 Dec 2022 03:50 IST

వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

నెల్లూరు (నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: ‘రైతులు వరి పండిస్తే కొనడానికి ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. సాగు ఎవరికీ భారం కాకూడదు అన్నాను. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందేందుకు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టిపెడితే మంచిదన్న నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు’ అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మంగళవారం నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘కొత్త వంగడాలను పరిచయం చేసి ఒక్క ఏడాదిలో 13 లక్షల టన్నుల ఉత్పత్తిని పెంచాము. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని.. లాభసాటి పంటలు సాగు చేయాలని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చెప్పాను. రైతులకు ఇవ్వాల్సిన బకాయిలను చంద్రబాబు ఎగ్గొట్టి వెళ్లారు. ఆయన నిర్వాకం వల్లే పౌరసరఫరాల సంస్థ పరిస్థితి దారుణంగా తయారైంది. రైతుల సంక్షేమం కోసం వైకాపా ప్రభుత్వం అహర్నిశలు పని చేస్తోంది. రైతు భరోసా ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానిదే. ఎవరి హయాంలో పంటలు పండాయో.. దిగుబడులు పెరిగాయో పరిశీలించేందుకు రండి’ అన్నారు. రైతులు పండించే అన్ని రకాల పంటలనూ కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని