ఎస్కేయూలో లా ప్రవేశాలు కొనసాగించాలి

అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో అధ్యాపకులు, సిబ్బంది కొరతను సాకుగా చూపి మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు నిర్వహించలేమని, లా ప్రవేశాలు చేపట్టవద్దంటూ రిజిస్ట్రార్‌ ఉన్నత విద్యామండలి కార్యదర్శికి లేఖ రాయడం అన్యాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు.

Published : 07 Dec 2022 03:50 IST

సీఎంకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ

ఆజాద్‌నగర్‌, న్యూస్‌టుడే: అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో అధ్యాపకులు, సిబ్బంది కొరతను సాకుగా చూపి మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు నిర్వహించలేమని, లా ప్రవేశాలు చేపట్టవద్దంటూ రిజిస్ట్రార్‌ ఉన్నత విద్యామండలి కార్యదర్శికి లేఖ రాయడం అన్యాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు ఆయన మంగళవారం లేఖ రాశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామంటూనే, ఎస్కేయూలో న్యాయవిద్య కోర్సును ఎత్తేయడం న్యాయమేనా? ప్రైవేటు కళాశాలల్లో అధిక ఫీజులు చెల్లించలేక విద్యార్థులు నష్టపోరా? అని ప్రశ్నించారు. ‘ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తామంటోంది. మరోపక్క అమరావతిలోనే ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వేణుగోపాల్‌ సుప్రీంకోర్టుకు స్పష్టంచేశారు. ఈ ద్వంద్వ వైఖరి సుప్రీంకోర్టును మోసం చేయడానికా? లేక సీమ ప్రజలను మభ్యపెట్టడానికా?’ అని ప్రశ్నించారు. అన్ని విశ్వవిద్యాలయాల్లో సిబ్బంది ఖాళీలను భర్తీ చేసి కోర్సులు కొనసాగించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని