కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌ అరెస్టు.. విడుదల

జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ను పోలీసులు మంగళవారం అరెస్టుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు భద్రత కల్పించాలని, తొలగింపుల జీవోలు ఉపసంహరించుకోవాలని మంగళవారం విశాఖలో నిరసన చేపట్టేందుకు తెలుగుతల్లి విగ్రహం వద్దకు ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకొని ఆయనను అరెస్టు చేసి మూడో పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు.

Published : 07 Dec 2022 03:50 IST

విశాఖపట్నం (మద్దిలపాలెం) న్యూస్‌టుడే: జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ను పోలీసులు మంగళవారం అరెస్టుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు భద్రత కల్పించాలని, తొలగింపుల జీవోలు ఉపసంహరించుకోవాలని మంగళవారం విశాఖలో నిరసన చేపట్టేందుకు తెలుగుతల్లి విగ్రహం వద్దకు ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకొని ఆయనను అరెస్టు చేసి మూడో పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు మోసం చేశారన్నారు. ఆయనను పోలీసులు మధ్యాహ్నం విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని