పరిశోధనా నివేదిక వచ్చాకే తీర్పు

ఏపీలోని ఏలూరు జిల్లా కొల్లేరు సరస్సు ఆక్రమణలపై పూర్తిస్థాయి పరిశోధన నివేదిక సమర్పించిన తరవాతే తీర్పు వెల్లడిస్తామని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) దక్షిణాది జోన్‌ (చెన్నై) ఉత్తర్వులు ఇచ్చింది.

Published : 07 Dec 2022 05:15 IST

‘కొల్లేరు’ ఆక్రమణలపై ఎన్జీటీ

ఈనాడు-చెన్నై: ఏపీలోని ఏలూరు జిల్లా కొల్లేరు సరస్సు ఆక్రమణలపై పూర్తిస్థాయి పరిశోధన నివేదిక సమర్పించిన తరవాతే తీర్పు వెల్లడిస్తామని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) దక్షిణాది జోన్‌ (చెన్నై) ఉత్తర్వులు ఇచ్చింది. కొల్లేరు సరస్సు ఆక్రమణలపై విచారణను ఎన్జీటీ సుమోటోగా  చేపట్టింది. తాజాగా కోరం సభ్యులు జస్టిస్‌ పుష్ప సత్యనారాయణ, డాక్టర్‌ సత్యగోపాల్‌ కొర్లపాటి ఇచ్చిన ఉత్తర్వుల మేరకు.. ఈ ఏడాది మే 24న ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం కొల్లేరులో ఆక్రమణలను గుర్తించి తొలగించేందుకు, ఆ ప్రాంతం మొత్తాన్ని అటవీశాఖకు అప్పగించేందుకు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి శాస్త్రీయ పరిశోధన చేస్తోంది. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో 12 మాసాల గడువు విధించామని, ఈలోపు వారు నివేదిక సమర్పించాల్సి ఉందని తెలిపారు. ఆక్రమణల కేసు ఈ నివేదికతో ముడిపడి ఉందని ఎన్జీటీ అభిప్రాయపడింది. విచారణను జనవరి 23కు వాయిదా వేసింది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు