Praveen Prakash: సారొస్తారు.. మెనూతో సిద్ధంగా ఉండాల్సిందే..!
పాఠశాలల తనిఖీలకు క్షేత్రస్థాయిలో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పర్యటించే సమయంలో పాటించాల్సిన నిబంధనలతో పాటు ఆయన తీసుకునే ఆహార మెనూను సైతం పేర్కొంటూ ఆదేశాలు జారీ అయ్యాయి.
పాఠశాలల తనిఖీలకు ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్
ఈనాడు, అమరావతి: పాఠశాలల తనిఖీలకు క్షేత్రస్థాయిలో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ (Praveen Prakash) పర్యటించే సమయంలో పాటించాల్సిన నిబంధనలతో పాటు ఆయన తీసుకునే ఆహార మెనూను సైతం పేర్కొంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఎక్కడైనా రాత్రి బస చేసిన సమయంలో ఆయనకు ఏ సమయానికి ఏ మోనూను అందించాలో పేర్కొన్నారు. జిల్లాల పర్యటనకు వెళ్లిన సమయంలో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు తనిఖీలు, సాయంత్రం రెసిడెన్షియల్ పాఠశాలలు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు(కేజీబీవీ), ఆదర్శ పాఠశాలలను సందర్శించనున్నారు. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీకి సన్నాహాలు, ఉపాధ్యాయులకు శిక్షణ, మధ్యాహ్న భోజన పథకం, నాడు-నేడు, విద్యాకానుక, సీబీఎస్ఈ అనుబంధం, ఫార్మెటివ్-1,2 పరీక్షలలో విద్యార్థుల పనితీరు, సమ్మెటివ్-1 పరీక్షకు సన్నద్ధత, ఆంగ్ల మాధ్యమంలో పనితీరు తదితర సమాచారాన్ని అధికారులు సిద్ధం చేయాల్సి ఉంటుంది. అలాగే మోనూ కూడా. ఇటీవల ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి, గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలోని ఆత్మకూరు పాఠశాలలను ఆయన తనిఖీలు చేశారు.
బస చేస్తే మెనూ ఇలా..
* ఉదయం 6గంటలకు టీతో పాటు పార్లే లేదా క్రాక్‌జాక్ బిస్కెట్లు.
* 8గంటలకు ఇడ్లీ, దోశ, ఉల్లి దోశల్లో ఏదో ఒకటి అల్పాహారం.
* మధ్యాహ్నం 1.30గంటలకు కూరగాయల కూరతో చపాతి లేదా పుల్కా.
* సాయంత్రం 5గంటలకు టీ, బిస్కెట్స్
* రాత్రి 8.30గంటలకు కూరగాయల కూరతో పుల్కా లేదా చపాతి. ఒక గ్లాసు పాలు.
* పండ్లు, ఎండు ఫలాలు, పండ్ల రసాలు, మాంసాహారం, ఇతర ఆహార పదార్థాలు తీసుకోరు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Crime News
Kadapa: కడప నడిబొడ్డున ఇద్దరు యువకుల దారుణహత్య
-
World News
Miss Universe : మిస్ యూనివర్స్ పోటీలు.. నన్ను చూసి వారంతా పారిపోయారు..!
-
Movies News
Samantha: ఎంతోకాలం తర్వాత గాయని చిన్మయి గురించి సమంత ట్వీట్
-
India News
Parliament: ‘అదానీ - హిండెన్‌బర్గ్’పై చర్చకు విపక్షాల పట్టు.. పార్లమెంట్లో గందరగోళం
-
Crime News
Hyderabad: సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఇంట్లో భారీ చోరీ