న్యాయమూర్తుల బదిలీలను పునఃసమీక్షించాలి
ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డి.రమేశ్‌ల ఆకస్మిక బదిలీలను తక్షణం నిలిపివేయాలని, న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడాలని న్యాయవాదులు హైకోర్టు వద్ద నినాదాలు చేశారు.
ఈనాడు, అమరావతి: ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డి.రమేశ్‌ల ఆకస్మిక బదిలీలను తక్షణం నిలిపివేయాలని, న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడాలని న్యాయవాదులు హైకోర్టు వద్ద నినాదాలు చేశారు. బదిలీ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు కొలీజియం పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా న్యాయమూర్తులుగా ముద్రపడిన ఇద్దరు జడ్జీలను బదిలీ చేయడం సరికాదన్నారు. మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో హైకోర్టు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి నినాదాలు చేశారు. ఏపీ అడ్వొకేట్స్ ఐకాస కన్వీనర్లు వై.కోటేశ్వరరావు (వైకే), జడా శ్రావణ్‌కుమార్, డీఎస్ఎన్వీ ప్రసాదబాబు, జీవీ శివాజీ, వాసిరెడ్డి ప్రభునాథ్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో న్యాయవాదులు నల్లూరి మాధవరావు, కేఎం కృష్ణారెడ్డి, అంజన్‌రెడ్డి, నర్రా శ్రీనివాసరావు, సోమరాజు, గద్దె కోటినాగులు, అంచ పాండురంగారావు, సలీం పాషా, జై భీమారావు, నాగూరు నాగరాజు, గోల్ల బసవేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Kotamreddy: కాసేపట్లో మళ్లీ మీడియా ముందుకు కోటంరెడ్డి
-
Crime News
కారులో మంటలు.. గర్భిణి, భర్త సజీవదహనం
-
Politics News
Raghurama: వైకాపాలో తిరగబడే రోజులు మొదలయ్యాయి: ఎంపీ రఘురామ
-
World News
12 మంది భార్యలు.. సెంచరీ దాటిన పిల్లలు!
-
Politics News
మాజీ మంత్రి ముత్తంశెట్టికి చుక్కెదురు.. రోడ్డుకు అడ్డంగా చెప్పుల దండ కట్టి నిరసన