తీరాన్ని వదల్లేదు!
అధికార పార్టీ నేతల భూదాహానికి అంతూపొంతు లేకుండాపోతోంది. ప్రకాశం జిల్లాలోని సముద్ర తీర ప్రాంతంలో సీఆర్‌జడ్ నిబంధనలను ఉల్లంఘించి భూముల్ని ఆక్రమించడమే కాకుండా రొయ్యల చెరువులుగా మార్చి సాగుచేసుకుంటున్నా అధికారులు కన్నెత్తి చూడటంలేదు.
మూడేళ్లుగా అనుమతుల్లేకుండా రొయ్యల సాగు
వైకాపా నాయకుల నిర్వాకం
ఈనాడు డిజిటల్, ఒంగోలు, సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: అధికార పార్టీ నేతల భూదాహానికి అంతూపొంతు లేకుండాపోతోంది. ప్రకాశం జిల్లాలోని సముద్ర తీర ప్రాంతంలో సీఆర్‌జడ్ నిబంధనలను ఉల్లంఘించి భూముల్ని ఆక్రమించడమే కాకుండా రొయ్యల చెరువులుగా మార్చి సాగుచేసుకుంటున్నా అధికారులు కన్నెత్తి చూడటంలేదు. చివరకు కలెక్టర్ ఆదేశాలను సైతం కిందిస్థాయి అధికారులు పట్టించుకోవడంలేదు. సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం, బింగినపల్లి గ్రామాల పరిధిలోని సముద్ర తీరం వెంబడి కొందరు వైకాపా కిందిస్థాయి నాయకులు భూముల్ని ఆక్రమించారు. దాదాపు 40 ఎకరాల్లో అనుమతులు లేకుండా 15కు పైగా చెరువులు ఏర్పాటు చేశారు. వాటిలో మూడేళ్లుగా రొయ్యలు సాగు చేస్తున్నారు. పైస్థాయి నేతల అండ ఉండటంతో అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఆక్రమించిన భూములను కొందరు నేతలు ఎకరా రూ.10 లక్షల చొప్పున నెల్లూరు జిల్లా కావలి ప్రాంత వాసులకు విక్రయించినట్లు తెలిసింది. రొయ్యలు సాగుచేసేవారు సముద్ర తీరం వెంబడి పదుల సంఖ్యలో బోర్లు వేసి మోటార్ల ద్వారా చెరువులకు నీటిని మళ్లిస్తున్నారు. వీటికి ప్రభుత్వ అనుమతులు లేకపోయినా అధికారులు విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. భూములను ఆక్రమించిన ఆరుగురిపై స్థానిక పోలీసు స్టేషనులో కేసులు నమోదైనా రాజకీయ పలుకుబడితో బెయిల్ పొంది యథాప్రకారం సాగు చేస్తున్నారు.
కలెక్టర్ ఆదేశాలూ పట్టలేదు
సముద్ర తీరంలో కెరటాలు తాకే ప్రదేశానికి 500 మీటర్ల లోపు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూదన్న సీఆర్‌జడ్ నిబంధనలు ఇక్కడ అమలు కావడంలేదు. సముద్రానికి 40, 50 మీటర్ల సమీపంలోనే బోర్లు వేసి మోటార్లు బిగించి చెరువుల్లోకి నీరు మళ్లించి రొయ్యలు సాగు చేస్తున్నారు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా బెదిరింపులకు దిగడంతో ఆ మధ్య కలెక్టరేట్లో నిర్వహించే ‘స్పందన’లో ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్.. ఆ అక్రమ చెరువులను తొలగించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సిబ్బంది పొక్లెయినర్‌తో అక్కడకు చేరుకోగా వైకాపా నాయకులు అడ్డుకున్నారు. ఈ చెరువుల విషయమై సింగరాయకొండ తహసీల్దారు ఉష వద్ద ప్రస్తావించగా వీటిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. విద్యుత్తుశాఖ ఏఈ సాంబశివరావును వివరణ కోరగా ‘సాగుదారులకు నోటీసులు అందజేశాం. త్వరలో సరఫరా ఆపేస్తాం’ అని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Earthquake: తుర్కియేలో 1100 సార్లు ప్రకంపనలు.. 17వేలు దాటిన మరణాలు
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
IND vs AUS: భారత్ X ఆసీస్.. బౌలర్లు ముగించారు.. బ్యాటర్లు ఆరంభించారు..!
-
Politics News
Chandrababu: జగన్‌ను చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది: చంద్రబాబు
-
Movies News
Natti Kumar: కౌన్సిల్ ఒక్కటే ఉండాలి.. ‘దాసరి’పై సినిమా తీయబోతున్నాం.. నట్టి కుమార్
-
World News
Earthquake: ఆ భూకంప ధాటికి.. దేశమే 5మీటర్లు జరిగింది..!