స్మార్ట్‌గా భారం
గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లు ఏర్పాటుచేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వస్తున్నా, వినియోగదారులపై భారమని నిపుణులు హెచ్చరిస్తున్నా ప్రభుత్వానికి పట్టట్లేదు.
విమర్శలు వస్తున్నా ఇళ్లకు మీటర్లపై టెండర్లకు రంగం సిద్ధం
డిస్కంల ప్రతిపాదనలకు జ్యుడిషియల్ ప్రివ్యూకమిటీ ఆమోదం
ప్రాజెక్టు అమలుకు కొత్త రుణాల కోసం ప్రయత్నం
ఈనాడు, అమరావతి: గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లు ఏర్పాటుచేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వస్తున్నా, వినియోగదారులపై భారమని నిపుణులు హెచ్చరిస్తున్నా ప్రభుత్వానికి పట్టట్లేదు. పంపిణీ సంస్థల పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్) కింద రాష్ట్రంలో 27.68 లక్షల కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లు ఏర్పాటుచేయాలని డిస్కంలు నిర్ణయించాయి. దీనికి రూ.2,210 కోట్లతో ప్రతిపాదనలను రూపొందించాయి. వాటి ప్రకారం నెల వినియోగం 300 యూనిట్లు దాటిన గృహవిద్యుత్ కనెక్షన్లు, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లకు మొదటిదశలో స్మార్ట్‌మీటర్లు ఏర్పాటుచేయాలని ప్రతిపాదించాయి. దీనిపై డిస్కంల ప్రతిపాదనలను జ్యుడిషియల్ ప్రివ్యూకమిటీ ఆమోదించింది. దీంతో ఒకటి, రెండు రోజుల్లో టెండర్లు పిలవాలని డిస్కంలు నిర్ణయించాయి. కేంద్రం ఇచ్చే గ్రాంటు పోను, పథకం అమలుకు రూ.1,850 కోట్లు అవసరమని.. ఈ మొత్తాన్ని రుణంగా తీసుకునేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని డిస్కంలు కోరాయి. దీనికి ఆమోదం లభించిందని ఒక అధికారి తెలిపారు. డిస్కంల అప్పులు ఇప్పటికే రూ.56వేల కోట్లకు చేరాయి. ఇప్పుడు మీటర్ల కొనుగోలు, నిర్వహణ కోసం కొత్త అప్పులు చేయాల్సివస్తోంది.
కేంద్రం గ్రాంటు రూ.373 కోట్లు
ఒక్కో స్మార్ట్మీటరుకు రూ.900, డిసెంబరు 23 నాటికి పనులు పూర్తిచేస్తే అదనంగా మరో రూ.450 కేంద్రం గ్రాంటుగా ఇస్తుంది. డిస్కంల ప్రతిపాదనల ప్రకారం రూ.373 కోట్లు గ్రాంటు రూపేణా అందనుంది. దీన్ని గుత్తేదారు సంస్థకు ముందుగా చెల్లించాలని, మిగిలిన మొత్తాన్ని ప్రతినెలా చెల్లించే నిర్వహణ వ్యయంతో కలిపి ఐదేళ్లలో చెల్లించాలని డిస్కంలు నిర్ణయించాయి. కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ 9.77 లక్షల మీటర్లు, తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ 8.05 లక్షలు, దక్షిణ విద్యుత్‌పంపిణీ సంస్థ 9.86 లక్షల కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లు ఏర్పాటుచేయాలని ప్రతిపాదించాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
IND vs AUS: భారత్ X ఆసీస్.. బౌలర్లు ముగించారు.. బ్యాటర్లు ఆరంభించారు..!
-
Politics News
Chandrababu: జగన్‌ను చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది: చంద్రబాబు
-
Movies News
Natti Kumar: కౌన్సిల్ ఒక్కటే ఉండాలి.. ‘దాసరి’పై సినిమా తీయబోతున్నాం.. నట్టి కుమార్
-
World News
Earthquake: ఆ భూకంప ధాటికి.. దేశమే 5మీటర్లు జరిగింది..!
-
India News
Kiren Rijiju: న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు లేవు : కేంద్రం