Vijayasai Reddy: సాయిరెడ్డి.. సర్వం తానై!
వైకాపా నిర్వహించిన ‘జయహో బీసీ’ మహాసభకు కర్త, కర్మ, క్రియ.. ఇలా అన్నింటా తానై వ్యవహరించారు పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి. వేదిక ఎలా ఉండాలి? వేదికపై ఎవరెవరుండాలి? ఆహ్వానితులెవరు? తదితరాలన్నీ ఆయన దర్శకత్వంలోనే జరిగాయి.
ప్రసంగించని బొత్స, బోస్ వంటి బీసీ నేతలు
పార్టీ, ప్రభుత్వంలో ఆ ఆరుగురిదే హవా
ఈనాడు, అమరావతి: వైకాపా నిర్వహించిన ‘జయహో బీసీ’ మహాసభకు కర్త, కర్మ, క్రియ.. ఇలా అన్నింటా తానై వ్యవహరించారు పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి. వేదిక ఎలా ఉండాలి? వేదికపై ఎవరెవరుండాలి? ఆహ్వానితులెవరు? తదితరాలన్నీ ఆయన దర్శకత్వంలోనే జరిగాయి. వైకాపా బీసీ విభాగం అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఉన్నప్పటికీ సభ వ్యవహారాలన్నీ సాయిరెడ్డి కనుసన్నల్లోనే సాగాయి. ఏర్పాట్లలో బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ మంత్రులతో పాటు ఆయన సభా ప్రాంగణానికి రెండు మూడు సందర్భాల్లో వెళ్లి పరిశీలించారు. అప్పుడూ సాయిరెడ్డి వెనుకే బీసీ మంత్రులంతా కన్పించారు. సభ జరుగుతున్నపుడూ వేదిక కింది నుంచి సాయిరెడ్డి పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి జగన్ వేదికపైకి వచ్చాక ఓసారి వెళ్లి సీఎంతో మాట్లాడారు. సాయిరెడ్డి లేని సమయంలో మంత్రి బొత్స సత్యనారాయణ సభను సమన్వయం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి, బీసీ నేతగా పేరున్న మంత్రి బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ వంటి వారికీ వేదికపై మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అయిన అంజాద్ బాషాను బీసీ కోటాలో మంత్రిని చేసినట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఆయనకూ మాట్లాడే అవకాశం రాలేదు. స్థానిక సంస్థల ప్రతినిధుల్లో జడ్పీ ఛైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, ఎంపీపీలు, సర్పంచుల్లో ఎవరికీ ప్రసంగించే అవకాశం రాలేదు.
వారికి ప్రత్యేక గుర్తింపు
బీసీల సభ కావడంలో వేదికపై విజయసాయిరెడ్డి కూర్చోలేదు. ఆయనతోపాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరుల కోసం ప్రధాన సభావేదిక పక్కనే ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. వైకాపాలో, రాష్ట్ర ప్రభుత్వంలో విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిలే కీలకం. పార్టీలో, ప్రభుత్వ వ్యవహారాల్లో ముఖ్యమంత్రి జగన్ వీరికే కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Easter Attacks: ‘నన్ను క్షమించండి..’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన
-
India News
Khushbu Sundar: వీల్‌ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం
-
Sports News
PCB: మికీ ఆర్థర్ పాక్ ‘ఆన్లైన్ కోచ్’.. సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ
-
Technology News
WhatsApp: వాట్సాప్ వీడియో.. ఈ మార్పు గమనించారా..?
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Politics News
AAP: కర్ణాటకపై ఆప్ గురి: అజెండాపై కసరత్తు.. పార్టీల హామీలపై కౌంటర్!