ఏపీలో 1.91 లక్షల కిలోల గంజాయి స్వాధీనం

ఆంధ్రప్రదేశ్‌లో 2021లో 1,91,712 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ తెలిపారు.

Published : 08 Dec 2022 05:12 IST

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో 2021లో 1,91,712 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ తెలిపారు. బుధవారం రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు బదులిచ్చారు. ఆయన తెలిపిన ప్రకారం స్వాధీనం చేసుకున్న గంజాయి పరిమాణం మూడేళ్లలో 187% పెరిగింది. అక్రమ రవాణాకు సంబంధించి మూడేళ్లలో పెట్టిన కేసుల్లోనూ 151% పెరుగుదల నమోదైంది. ఏపీలో గంజాయిని సాగు చేసే జిల్లాల్లో ఆపరేషన్‌ పరివర్తన్‌ ప్రారంభించి, 2021-22లో 7,504 ఎకరాల్లో ధ్వంసం చేశామన్నారు. సొంత వినియోగం కోసం డ్రగ్స్‌ దగ్గర ఉంచుకున్న వారిపై నమోదైన కేసులు 2019లో 286 ఉండగా, 2020లో 264, 2021లో 550కి పెరిగినట్లు వెల్లడించారు.

విదేశీ విరాళాల లైసెన్సుల రద్దు: ఆంధ్రప్రదేశ్‌లో 2017-21 మధ్యకాలంలో 622 ఎఫ్‌సీఆర్‌ఏ (విదేశీ విరాళాల నియంత్రిత చట్టం) అనుమతుల(సర్టిఫికెట్లు)ను రద్దు చేసినట్లు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా 6,677, తెలంగాణలో 280 లైసెన్సులను రద్దు చేశామన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని