నిషేధిత జాబితా నుంచి ఎస్సీల భూములు తొలగింపు!

ఏళ్ల క్రితం నుంచి పేద ఎస్సీ రైతులకు వివిధ ప్రభుత్వాలు భూమి కొనుగోలు పథకం కింద జాతీయ ఎస్సీ ఆర్థిక అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ) ద్వారా రాయితీపై అందించిన భూములను నిషేధిత భూముల జాబితా (22ఏ) నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Published : 09 Dec 2022 02:54 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఏళ్ల క్రితం నుంచి పేద ఎస్సీ రైతులకు వివిధ ప్రభుత్వాలు భూమి కొనుగోలు పథకం కింద జాతీయ ఎస్సీ ఆర్థిక అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ) ద్వారా రాయితీపై అందించిన భూములను నిషేధిత భూముల జాబితా (22ఏ) నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1988 నుంచి 2008 వరకు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా రాష్ట్రవ్యాప్తంగా 17,000 ఎకరాలు ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ ద్వారా ఎస్సీ రైతులకు పంపిణీ అయినట్లు అధికారులు గుర్తించారు. ఇవన్నీ ఎస్సీ కార్పొరేషన్‌ వద్ద తనఖాలో ఉన్నాయి. వీటిని విడిపించి లబ్ధిదారులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా ఈ భూముల్ని నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. భూముల సర్వే నంబర్లు, సరిహద్దులు, లబ్ధిదారుల వివరాల్ని అధికారులు ఆన్‌లైన్‌ చేస్తున్నారు. ఈ నెల 13న నిర్వహించే మంత్రివర్గ సమావేశం నాటికి సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని