పెట్రో ధరలు దేశంలోకెల్లా ఏపీలోనే అధికం

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు దేశంలో అన్ని రాష్ట్రాల్లో కెల్లా ఆంధ్రప్రదేశ్‌లోనే అధికంగా ఉన్నాయి.

Published : 09 Dec 2022 06:44 IST

ఈనాడు, దిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు దేశంలో అన్ని రాష్ట్రాల్లో కెల్లా ఆంధ్రప్రదేశ్‌లోనే అధికంగా ఉన్నాయి. తర్వాతి స్థానంలో తెలంగాణ ఉంది. కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలి గురువారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ఈ విషయాన్ని వెల్లడించింది. ఆగస్టు నుంచి నవంబరు మధ్యకాలంలో ఏపీలో పెట్రోల్‌ ధర లీటరుకు రూ.111.87, డీజిల్‌ రూ.99.61 మేర ఉంది. మరే రాష్ట్రంలోనూ ఈ ధరలు లేవు. ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ ఉంది. ఆంధ్రప్రదేశ్‌ పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లో ఇక్కడికంటే ధరలు తక్కువగా ఉన్నాయి. దేశంలో అత్యల్ప ధరలు అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ఉన్నాయి. అక్కడ పెట్రోల్‌ రూ.84.10, డీజిల్‌ రూ.79.74కి విక్రయిస్తున్నారు. దేశంలోని 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కేవలం 16 చోట్ల మాత్రమే పెట్రోల్‌ ధర రూ.100కి మించి, డీజిల్‌ రూ.90కిమించి ధర పలుకుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని