రైతన్నకు ‘ఈ-క్రాప్‌’ కష్టాలు

ఈ-క్రాప్‌లో పంట నమోదు చేయకపోవడంతో ధాన్యం విక్రయించేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు.

Published : 09 Dec 2022 03:20 IST

గోకవరం, న్యూస్‌టుడే: ఈ-క్రాప్‌లో పంట నమోదు చేయకపోవడంతో ధాన్యం విక్రయించేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణునిపాలెం గ్రామానికి చెందిన గుర్రాల రాములు సొంత పొలంతో పాటు కొంత కౌలుకు తీసుకొని 12 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో 5 ఎకరాల పంట వివరాలు ఈ క్రాప్‌లో నమోదు చేసుకున్నారు. మిగతా భూమిలోని వివరాలు నమోదు చేయలేదు. ఈ ఏడెకరాల్లో పండిన ధాన్యాన్ని గ్రామంలోని ఆర్‌బీకేలో విక్రయించాలని చూడగా తీసుకోలేదు. దీంతో గురువారం ధాన్యం బస్తాలను కృష్ణునిపాలెం సచివాలయం వద్ద వేసి నిరసన తెలిపారు. కౌలు కార్డులు ఇచ్చిన అధికారులు ఈ క్రాప్‌ ఎందుకు చేయలేదని రైతు ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న ఇన్‌ఛార్జి తహసీల్దారు దివ్యభారతి, ఎంపీడీవో మూర్తి, ఏవో రాజేశ్వరి వచ్చి రైతుతో మాట్లాడారు. సాంకేతిక లోపంతో సమస్య ఏర్పడిందన్నారు. పరిష్కరిస్తామని చెప్పి, రైతు ధాన్యాన్ని మిల్లుకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని