ట్రాక్టరు బోల్తాపడిన ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం లక్ష్మయ్యవూరు వద్ద బుధవారం రాత్రి ట్రాక్టర్‌ బోల్తా పడిన ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రకటించారు.

Published : 09 Dec 2022 03:20 IST

ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం లక్ష్మయ్యవూరు వద్ద బుధవారం రాత్రి ట్రాక్టర్‌ బోల్తా పడిన ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రకటించారు. గురువారం ఆయన పూతలపట్టు, చిత్తూరు ఎమ్మెల్యేలు ఎంఎస్‌ బాబు, ఆరణి శ్రీనివాసులుతో కలిసి మృతుల కుటుంబసభ్యులను,  క్షతగాత్రులను పరామర్శించారు. మరణించిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ సురేందర్‌రెడ్డి కుటుంబానికి ఇల్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన పిల్లలను చదివిస్తానని చెప్పారు. మృతుల కుటుంబాలకు ఎంఎస్‌ బాబు వ్యక్తిగతంగా రూ.25 వేలు చొప్పున అందిస్తానని వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా, 19 మంది గాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని