ఇక నుంచి ఎయిమ్స్‌లో ఆరోగ్యశ్రీ సేవలు

మంగళగిరిలోని ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్‌లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు.

Published : 09 Dec 2022 05:21 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: మంగళగిరిలోని ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్‌లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ఈ మేరకు ఎయిమ్స్‌ యాజమాన్యంతో రాష్ట్ర ప్రభుత్వం గురువారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ‘ఎయిమ్స్‌లో ఆరోగ్యశ్రీ ట్రయల్‌రన్‌ చేపట్టాం. త్వరలో క్యాన్సర్‌ నిర్ధారణకు పెట్‌స్కాన్‌ ప్రారంభిస్తాం. మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌, విజయవాడ కార్పొరేషన్లనుంచి రోజుకు ఆరు లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నాం. మంచినీటి సమస్యకు వచ్చే ఏడాది జూన్‌ నాటికి శాశ్వత పరిష్కారం చూపుతాం’ అని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఎయిమ్స్‌ డైరెక్టర్‌ త్రిపాఠి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ప్రభుత్వ కార్యదర్శి నవీన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని