Cyclone Mandous: అర్ధరాత్రి మహాబలిపురం వద్ద తీరం దాటిన మాండౌస్
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మాండౌస్ శుక్రవారం ఉదయానికి తుపానుగా బలహీనపడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. క్రమంగా ఇది వాయవ్య దిశగా పయనించి అర్ధరాత్రి దాటాక పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటింది.
రోజంతా చలిగాలులు.. చిరుజల్లులు
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో విస్తారంగా వానలు
నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు
బ్రహ్మదేవంలో 125.75 మి.మీ వర్షం
ఈనాడు- అమరావతి, విశాఖపట్నం, తిరుపతి: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మాండౌస్ శుక్రవారం ఉదయానికి తుపానుగా బలహీనపడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. క్రమంగా ఇది వాయవ్య దిశగా పయనించి అర్ధరాత్రి దాటాక పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటింది. శనివారం ఉదయానికి తుపాను మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారనుంది. మధ్యాహ్నానికి అది మరింత బలహీనపడనుంది. తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ముసురు వాతావరణం నెలకొంది. శుక్రవారం చాలాచోట్ల చలిగాలులు వణికించాయి. తీరం వెంట 65 నుంచి 75 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి. అత్యధికంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలో 125.75, తిరుపతి జిల్లా నాయుడుపేటలో 114 మి.మీ వర్షపాతం నమోదైంది.
‘తుపాను తీరం దాటే సమయంలో మరింత విస్తారంగా వర్షాలు కురవొచ్చు. శనివారం దక్షిణ కోస్తాంధ్రలోని అత్యధిక చోట్ల, రాయలసీమలోని అనేక ప్రాంతాలతో పాటు ఉత్తర కోస్తాంధ్రలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడొచ్చు. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు ఉండొచ్చు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దు’ అని వాతావరణ కేంద్రం తెలిపింది.
రైతుల్లో తీవ్ర ఆందోళన
రాష్ట్రంలో వరి కోతల మీద ఉంది. యంత్రాలతో పంటను కోయించి రోడ్లపై ఆరబెట్టిన రైతులు జల్లుల నుంచి దాన్ని కాపాడుకునేందుకు పరదా పట్టల కోసం పరుగులు పెట్టారు. గుంటూరు, ప్రకాశం, కర్నూలు తదితర జిల్లాల్లో తీతకు సిద్ధంగా ఉన్న పత్తి తడిచిపోతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. 123 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ముంపు ప్రాంత బాధితులను అక్కడికి తరలించడానికి చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం నుంచి తిరుపతిలో వర్షం కురుస్తుండటంతో ఉదయం పుణె-రేణిగుంట- హైదరాబాద్ స్పైస్‌జెట్ విమానాన్ని పూర్తిగా రద్దు చేశారు. పలు విమానాలను ల్యాండింగ్ కాకుండా వెనక్కి పంపారు.
తమిళనాడులో భారీ వర్షాలు
చెన్నై, న్యూస్‌టుడే: తుపాను ప్రభావంతో తమిళనాడులోని కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురంతోపాటు పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, మరో 26 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. చెన్నైతో పాటు పలు జిల్లాల్లో పెనుగాలులతో చెట్లు విరిగిపడ్డాయి. శుక్రవారం చెన్నై నుంచి నడవాల్సిన 27 విమానాల్ని రద్దు చేశారు.చెన్నైతోపాటు 5 ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
రాష్ట్రంలో త్వరలోనే క్రీడాపాలసీ
-
Crime News
చాట్ జీపీటీతో జవాబులు.. ఎలక్ట్రానిక్ డివైస్‌తో చేరవేత!
-
Sports News
Ambati Rayudu: చివరి మ్యాచ్‌లో రాయుడు మెరుపు షాట్లు.. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ముగింపు
-
World News
Japan: ప్రధాని ఇంట్లో ప్రైవేటు పార్టీ.. విమర్శలు రావడంతో కుమారుడిపై వేటు!
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి
-
Sports News
Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్