AP Teachers Protest: ‘స్టేటస్‌’ మారిన ఆందోళన!

ఆందోళన తెలపాలంటే అడుగడుగునా ఆంక్షలెన్నో. నిరసన గళం విప్పాలంటే గొంతునొక్కే చేతులెన్నో. అందుకే న్యాయం చేయండి మహాప్రభో అని మొరపెట్టుకునేందుకూ బాధితులు వెనుకాడుతున్నారు. బహిరంగంగా సమస్యను చెప్పుకోలేక ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు. సామాజిక మాధ్యమాలే వేదికగా ఆవేదనను, ఆందోళనను తెలియజేస్తున్నారు. 

Updated : 11 Dec 2022 08:04 IST

ఆందోళన తెలపాలంటే అడుగడుగునా ఆంక్షలెన్నో. నిరసన గళం విప్పాలంటే గొంతునొక్కే చేతులెన్నో. అందుకే న్యాయం చేయండి మహాప్రభో అని మొరపెట్టుకునేందుకూ బాధితులు వెనుకాడుతున్నారు. బహిరంగంగా సమస్యను చెప్పుకోలేక ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు. సామాజిక మాధ్యమాలే వేదికగా ఆవేదనను, ఆందోళనను తెలియజేస్తున్నారు. ఇలాగైనా పాలకుల్లో స్పందన రాకపోతుందా అని చూస్తున్నారు. పదో తేదీ వచ్చినా నెల జీతం రాకపోయే సరికి ఉపాధ్యాయులు ఆవేదనను వాట్సప్‌ స్టేటస్‌ల్లో వెల్లడిస్తున్నారు. ‘డిసెంబరు 10వ తేదీ మానవ హక్కుల దినోత్సవం అయితే.. ప్రతి నెలా ఒకటో తేదీ జీతం పొందడం ఉద్యోగి హక్కు’ అని పలువురు ఉపాధ్యాయులు స్టేటస్‌గా పెట్టుకోవడం చర్చనీయాంశమైంది. ‘ప్రస్తుతం ఇది మన అందరి హక్కు. మానవ హక్కులను కాలరాస్తున్న పాలకులు నిరంకుశ ధోరణి విడనాడకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని అందులో పేర్కొన్నారు.       - న్యూస్‌టుడే, పెనుకొండ పట్టణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని