JEE MAIN: జేఈఈ మెయిన్‌ ఫీజు భారీగా పెంపు

జేఈఈ మెయిన్‌ దరఖాస్తు ఫీజును జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) భారీగా పెంచింది. జనరల్‌, ఓబీసీ అమ్మాయిలకు ఏకంగా రూ.325 నుంచి రూ.800లకు పెంచడం గమనార్హం.

Updated : 17 Dec 2022 07:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ దరఖాస్తు ఫీజును జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) భారీగా పెంచింది. జనరల్‌, ఓబీసీ అమ్మాయిలకు ఏకంగా రూ.325 నుంచి రూ.800లకు పెంచడం గమనార్హం. దేశవ్యాప్తంగా దాదాపు 11లక్షల మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేస్తారు. దానికితోడు 80 శాతానికిపైగా విద్యార్థులు రెండు విడతలూ పరీక్షలు రాస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది హాజరవుతారు. వారిలో అధిక శాతం మంది 2 సార్లు రాస్తారు. అలాగే బీఆర్క్‌, బీ ప్లానింగ్‌లో చేరేందుకు నిర్వహించే పేపర్‌-2కు కూడా దరఖాస్తు ఫీజును పెంచారు.

విదేశీయులకు కూడా...: విదేశీయులకు కూడా దరఖాస్తు ఫీజు పెరిగింది. అంతకుముందు అమ్మాయిలకు రూ.1,500, అబ్బాయిలకు రూ.3 వేలు ఉండగా.... ఈసారి అది వరుసగా రూ.4 వేలు, రూ.5 వేలు అయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు