Infosys Narayana Murthy: మూర్తీభవించిన పెద్దరికం!

ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తికి పెద్దలంటే ఎంత గౌరవమో తెలిపే ఓ చక్కటి, అపురూప ఘట్టం విజయనగరం జిల్లా రాజాంలోని జీఎంఆర్‌ కళాశాలలో ఆవిష్కృతమైంది.

Updated : 19 Dec 2022 06:57 IST

ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తికి పెద్దలంటే ఎంత గౌరవమో తెలిపే ఓ చక్కటి, అపురూప ఘట్టం విజయనగరం జిల్లా రాజాంలోని జీఎంఆర్‌ కళాశాలలో ఆవిష్కృతమైంది. ఆదివారం జీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో నారాయణమూర్తి ముఖ్యఅతిథిగా పాల్గొని, ప్రసంగించారు. అనంతరం వేదిక మీద ఉన్న జీఎంఆర్‌ గ్రూప్‌ అధినేత గ్రంధి మల్లికార్జునరావు సోదరుడు నీలాచలం వద్దకు వెళ్లి మోకాళ్లపై కూర్చొని పాదాభివందనం చేశారు. వేడుకకు హాజరైన వేల మంది విద్యార్థులు, ప్రముఖుల్లో ఈ అపురూప ఘట్టం స్ఫూర్తిని నింపింది. పెద్దలంటే ఆయనకున్న గౌరవం, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండేలనే విషయాన్ని చెప్పకనే చెప్పారని సభికులు హర్షధ్వానాలు చేశారు. ఇదే వేదికపై జీఎంఆర్‌ గ్రూప్‌ అధినేత గ్రంధి మల్లికార్జునరావుతో పాటు ఆయన సోదరులు నీలాచలం, చిన వెంకటరాజు, ఈశ్వరరావు నారాయణమూర్తిని  సత్కరించారు. 

 న్యూస్‌టుడే, రాజాం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని