Mohan babu: ‘పోలీసులు ప్రభుత్వాలకు తొత్తులుగా పనిచేయాల్సి వస్తోంది’

‘పోలీసులంటే నాకు ఎనలేని గౌరవం, మర్యాదలు ఉన్నాయి. అయితే... అధికారంలో ఏ ప్రభుత్వం ఉంటే దానికి పోలీసులు తొత్తులుగా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది...’ అని సినీనటుడు మోహన్‌బాబు విమర్శించారు.

Updated : 20 Dec 2022 06:56 IST

‘లాఠీ’ సినిమా వేడుకల్లో సినీ నటుడు మోహన్‌బాబు

తిరుపతి (జీవకోన), తిరుపతి విద్య, న్యూస్‌టుడే: ‘పోలీసులంటే నాకు ఎనలేని గౌరవం, మర్యాదలు ఉన్నాయి. అయితే... అధికారంలో ఏ ప్రభుత్వం ఉంటే దానికి పోలీసులు తొత్తులుగా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది...’ అని సినీనటుడు మోహన్‌బాబు విమర్శించారు. తిరుపతి నగరంలోని ఎస్‌డీహెచ్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో సోమవారం జరిగిన ‘లాఠీ’ సినిమా ముందస్తు విడుదల వేడుకలకు హీరో విశాల్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ.. ‘పోలీసులకే మొదట నిజాలు తెలుస్తాయి. అయినా... సమాజంలో జరుగుతున్న తప్పులను కళ్లారా చూసి కూడా ఇది తప్పు అని చెప్పలేని స్థితిలో వారు ఉన్నారు. ఒకవేళ తప్పును తప్పు అని చెబితే తమ ఉద్యోగాలు ఊడిపోతాయన్న భయం వారిలో ఉంది...’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో సినీనటుడు విశాల్‌ మాట్లాడుతూ.. తనకు చంద్రబాబునాయుడు అంటే    చాలా ఇష్టమని, ఆయనతో పోటీ లేదన్నారు. ప్రస్తుతం తాను రాజకీయాలపై ఆసక్తి చూపడం లేదని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని