వకుళాభరణం కృష్ణమోహన్‌రావుకు ‘బహుజన బంధు’ పురస్కారం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), తానా ఫౌండేషన్‌, తానా ప్రపంచ తెలుగు సాహిత్య వేదిక, తారా ఆర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో నిర్విరామంగా 12 గంటలపాటు నిర్వహించిన ‘బహుజన కళోత్సవం’ ఆద్యంతం అలరించింది.

Updated : 02 Jan 2023 05:17 IST

12 గంటలపాటు నిర్విరామంగా సాగిన కళోత్సవం

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), తానా ఫౌండేషన్‌, తానా ప్రపంచ తెలుగు సాహిత్య వేదిక, తారా ఆర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో నిర్విరామంగా 12 గంటలపాటు నిర్వహించిన ‘బహుజన కళోత్సవం’ ఆద్యంతం అలరించింది. ప్రారంభోత్సవ సభలో తానా తొలిసారి ప్రకటించిన ‘బహుజన బంధు’ పురస్కారాన్ని రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ డా.వకుళాభరణం కృష్ణమోహన్‌రావుకు సంస్థ అధ్యక్షులు అంజయ్యచౌదరి లావు అందజేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన సాంస్కృతిక సారథి ఛైర్మన్‌, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ తన పాటలతో ప్రేక్షకులను ఉత్తేజపరిచారు. కృష్ణమోహన్‌రావు ప్రసంగిస్తూ.. బీసీల అభ్యున్నతికి తుదకంటూ పాటుపడతానన్నారు. అంజయ్య చౌదరి మాట్లాడుతూ.. బహుజన కళారూపాలను సంస్కృతీ వైభవానికి ప్రతీకలుగా అభివర్ణించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక అధ్యక్షులు డా.ప్రసాద్‌ తోటకూర మాట్లాడుతూ.. వెలుగుచూడని మరెన్నో బహుజన కళారూపాలను తమ వేదిక ద్వారా పరిచయం చేస్తామన్నారు. అనంతరం పద్మశ్రీ పురస్కార స్వీకర్తలు దళవాయి చలపతిరావు, కిన్నెరమెట్ల మొగిలయ్య, చింతకింది మల్లేశం, ఆచార్య కొలకలూరి ఇనాక్‌, ఎడ్ల గోపాలరావు, డా.కూటికుప్పల సూర్యారావు, డా.సాయిబాబాగౌడ్‌లను సత్కరించారు. లండన్‌కు చెందిన తెలుగు పాటల గాయకుడు ‘పోలాండ్‌ బుజ్జి’ని సన్మానించారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన బహుజన కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తారా ఆర్ట్స్‌ నిర్వాహకులు రాజేష్‌ సంకె సమన్వయకర్తగా వ్యవహరించారు. నటుడు, ఐపీఎస్‌ అధికారి కృష్ణసాయి, వ్యాపారవేత్త మంజులరాణి, నర్తకి సజిని వల్లభనేని పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు