Chittoor: బస్సు ఈడ్చుకెళ్లినా.. బతికాడు

వాహనదారులు, స్థానికుల అప్రమత్తతతో ఓ వృద్ధుడి ప్రాణాలు నిలిచాయి. చిత్తూరు జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలోని వంతెన వద్ద శనివారం ఈ ఘటన జరిగింది.

Updated : 22 Jan 2023 08:55 IST

ఈనాడు, చిత్తూరు: వాహనదారులు, స్థానికుల అప్రమత్తతతో ఓ వృద్ధుడి ప్రాణాలు నిలిచాయి. చిత్తూరు జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలోని వంతెన వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. చిత్తూరు నుంచి అరగొండ వెళ్లే పల్లె వెలుగు బస్సు బస్టాండు నుంచి బయటకు వస్తుండగా.. ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో డ్రైవర్‌ బస్సును ఆపారు. అదే సమయంలో జీడీ నెల్లూరు మండలం బాలగంగనపల్లికి చెందిన వృద్ధుడు హుస్సేన్‌ బస్సు ఆగిందని రోడ్డు దాటే ప్రయత్నం చేశారు. వాహనాలు కదలడంతో వృద్ధుణ్ని గమనించకుండా డ్రైవర్‌ బస్సును కదిలించారు. వాహనం ఢీకొట్టడంతో అక్కడే కిందపడి వాహనం కిందకు వెళ్లిపోయారు. కొద్దిదూరం ఆయనను బస్సు ఈడ్చుకెళ్లింది. వాహనదారులు, స్థానికులు కేకలు వేయడంతో డ్రైవర్‌ బస్సును నిలిపేశారు. నిర్ఘాంతపోయిన వృద్ధుణ్ని స్థానికులు బయటకు తీశారు. ప్రమాదంలో ఆయన కాలికి గాయం కావటంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని