ఓఎంసీ కేసును కొట్టివేయండి: హైకోర్టులో సబిత

అనంతపురం జిల్లా ఓబుళాపురం అక్రమ మైనింగ్‌కు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ అప్పటి గనుల శాఖ మంత్రి, ప్రస్తుత తెలంగాణ విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

Updated : 25 Jan 2023 05:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: అనంతపురం జిల్లా ఓబుళాపురం అక్రమ మైనింగ్‌కు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ అప్పటి గనుల శాఖ మంత్రి, ప్రస్తుత తెలంగాణ విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ నమోదు చేసిన ఓఎంసీ కేసు నుంచి తప్పించాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు గత ఏడాది అక్టోబరు 17న కొట్టివేసింది. దీనిని సవాలు చేస్తూ సబితా ఇంద్రారెడ్డి హైకోర్టులో రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అందులో.. ‘దర్యాప్తులో ఎలాంటి కొత్త అంశాలు లేకపోయినా సీబీఐ నన్ను నిందితురాలిగా చేర్చింది. ఈ విషయాన్ని సీబీఐ కోర్టు పట్టించుకోలేదు. డిశ్ఛార్జి పిటిషన్‌లో నేను లేవెనెత్తిన అభ్యంతరాలకు సమాధానం చెప్పలేదు. గనుల లీజులకు సంబంధించి నా పాత్రపై సీబీఐ గుర్తించలేదు. సీబీఐ కోర్టు కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు...’ అని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై త్వరలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ విచారణ చేపట్టే అవకాశాలున్నాయి.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు