ఎక్స్‌రేలకు బ్రేక్‌!

రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఆ ప్రభావం రోగుల పరీక్షలపై పడింది. పీపీపీ విధానంలో రోగులకు ఎక్స్‌రే,

Published : 25 Jan 2023 03:57 IST

సీటీ స్కాన్‌కు కూడా
బకాయిలు చెల్లించనందుకు పరీక్షల నిలిపివేతకు ప్రైవేటు సంస్థ నిర్ణయం

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఆ ప్రభావం రోగుల పరీక్షలపై పడింది. పీపీపీ విధానంలో రోగులకు ఎక్స్‌రే, సీటీ స్కాన్‌ సేవలను అందిస్తోన్న ప్రైవేట్‌ సంస్థకు రూ.7 కోట్ల వరకు ప్రభుత్వం బకాయి పడింది. కిందటేడాది మార్చి నుంచి చెల్లింపులు జరగక పోతుండటంతో... తాము అందించే ఎక్స్‌రే, సీటీ స్కాన్‌ సేవలను మంగళవారం పాక్షికంగా నిలిపివేసినట్లు, బుధవారం నుంచి పూర్తి స్థాయిలో ఆపేయనున్నట్లు ప్రభుత్వానికి ఆ సంస్థ స్పష్టం చేసింది. అత్యవసర కేసులకే ఎక్స్‌రే పరీక్ష చేస్తామంది. ఎంపిక చేసిన ప్రైవేటు సంస్థ ద్వారా టెక్కలి, ప్రొద్దుటూరు, చీరాల, గూడూరు ఆసుపత్రుల్లో సీటీ స్కాన్‌ సేవలు రోగులకు అందుతున్నాయి.  జిల్లా, ప్రాంతీయ, సామాజిక, మాతా శిశు సంరక్షణ కేంద్రాల్లో 125 చోట్ల ఎక్స్‌రే సేవలు అందుతున్నాయి. సగటున రోజుకు 2,000 మందికి ఎక్స్‌రే పరీక్షలు చేస్తున్నారు.  డయాలసిస్‌, ఇతర వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే పలు ప్రైవేట్‌ సంస్థలకూ ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని