పోలీసుకు భద్రత ఏదీ?
పోలీసు ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఒకరు మంగళగిరి సమీపంలోని ఓ అపార్టుమెంట్‌లో ఫ్లాటు కొనేందుకు గతేడాది మార్చి నెలలో బిల్డర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
రుణం అందక కష్టాలు
పెండింగ్ దరఖాస్తులకు మోక్షమెప్పుడో?
ఆందోళన చెందుతున్న సిబ్బంది
పోలీసు ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఒకరు మంగళగిరి సమీపంలోని ఓ అపార్టుమెంట్‌లో ఫ్లాటు కొనేందుకు గతేడాది మార్చి నెలలో బిల్డర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్సుగా రూ.లక్ష ఇచ్చారు. పూర్తి సొమ్ము మూడు నెలల్లోగా చెల్లించాలనేది ఒప్పందం. ఈ ప్రక్రియలో భాగంగా గృహ రుణం కోసం తమ శాఖలోని ‘భద్రత’ విభాగానికి దరఖాస్తు చేసుకున్నారు. బిల్డర్‌తో ఒప్పందం గడువు ముగిసినప్పటికీ రుణం మంజూరు కాలేదు. బిల్డర్‌ను ఒప్పించి మరో రెండు నెలలు గడువు పొందినప్పటికీ నిరీక్షణ ఫలించలేదు. ఫలితంగా ఒప్పందం రద్దయింది. చెల్లించిన అడ్వాన్సు రూ.లక్ష పోయాయి. కానిస్టేబుల్ లబోదిబోమంటున్నారు.
కాకినాడ జిల్లాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఒకరు కాకినాడలో ఇల్లు కొనేందుకు గతేడాది ఆగస్టులో బిల్డర్‌తో ఒప్పందం చేసుకున్నారు. రూ.లక్షన్నర అడ్వాన్సు చెల్లించారు. మిగతా సొమ్ము 3 నెలల్లో ఇవ్వాలని, నిర్దేశిత గడువులోగా చెల్లించనట్లయితే ఆ మొత్తంపై రూ.వందకు నెలకు రూపాయి వడ్డీ కట్టాలనేది ఒప్పందం. ‘భద్రత’లో గృహరుణానికి దరఖాస్తు చేసుకుంటే 3 నెలల్లోపే మంజూరవుతుందనే ధీమాతో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు. దరఖాస్తు చేసుకుని ఆరు నెలలవుతున్నా ఇప్పటికీ రుణం అందలేదు. దీంతో బిల్డర్‌కు నెలానెలా వడ్డీ కట్టాల్సి వస్తోంది.
విజయవాడలో పనిచేసే ఓ కానిస్టేబుల్ తన కుమార్తె వివాహానికి రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వివాహ ముహుర్తం వచ్చేసినప్పటికీ రుణం అందలేదు. దీంతో బయట అప్పు చేశారు.
ఈనాడు - అమరావతి
రాష్ట్ర పోలీసు శాఖలోని వందలాది సిబ్బంది రుణం అందక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అవసరానికి అండగా నిలవాల్సిన ‘భద్రత’ విభాగం చేతులెత్తేస్తోంది. సకాలంలో రుణాలు మంజూరు చేయడం లేదు. దీంతో వందలాది సిబ్బంది దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొందరు చెల్లించిన అడ్వాన్సు కోల్పోగా.. మరికొందరు వడ్డీలు చెల్లించుకుంటూ ఒప్పందం కాలపరిమితిని పొడిగించుకుంటున్నారు. దరఖాస్తు చేసుకున్ననాటినుంచి 2, 3 నెలల్లోపే గతంలో రుణాలు మంజూరయ్యేవని, ఇప్పుడు ఇబ్బందులు పెడుతున్నారని సిబ్బంది వాపోతున్నారు.
‘భద్రత’ ఇది..
రాష్ట్ర పోలీసు ఉద్యోగులకు క్యాడర్‌ను బట్టి వారి వేతనాలనుంచి ప్రతి నెలా నిర్దేశిత మొత్తాన్ని పోలీసు శాఖ మినహాయిస్తుంది. ఆ డబ్బులను భద్రత (ఏపీ పోలీసు డిపార్ట్‌మెంట్ ఎంప్లాయీ బెనెవొలెంట్ అండ్ థ్రిఫ్ట్ మ్యూచువల్ అసోసియేషన్) విభాగానికి జమ చేస్తుంది. ఆ నిధి నుంచి తమ సిబ్బందికి గృహ, వ్యక్తిగత, వివాహ, విద్య తదితర రుణాలను అతి తక్కువ వడ్డీకే ఇస్తారు. అందిన దరఖాస్తులను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరించేవారు. అయితే గతేడాదినుంచి ఈ రుణాలు సరిగా మంజూరు కావడం లేదు. పెద్దఎత్తున దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నాయి. గతేడాది ఆగస్టు వరకూ వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలన పేరిట వెనక్కి పంపించి మళ్లీ కొత్తగా తీసుకున్నారు. వాటికీ రుణాలు మంజూరు కావడంలేదు. బయటకొచ్చి మాట్లాడితే తమపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారన్న ఆందోళనతో వారెవరూ నోరు విప్పలేకపోతున్నారు. వేతనాల నుంచి మినహాయించిన సొమ్ముతో ఏర్పాటుచేసిన నిధి నుంచి తమకే రుణాలు ఇవ్వకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు.
నిధులేమైనా మళ్లించారా?
రుణాల మంజూరు ప్రక్రియలో జాప్యంపై పోలీసు సిబ్బంది కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ‘భద్రత’ నిధినీ తమ ఖాతాల్లోకి మళ్లించేసిందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు మాత్రం దీనిపై నోరు విప్పడం లేదు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
ఆక్సిటోసిన్ లవ్ హార్మోన్ కాదా?.. శాస్త్రవేత్తల పరిశోధనల్లో కీలక విషయాలు..
-
Politics News
Bachula Arjunudu: తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడికి తీవ్ర అస్వస్థత
-
Politics News
Andhra News: ప్రభుత్వ ఉద్యోగివా.. వైకాపా కార్యకర్తవా?
-
India News
మైనర్లను పెళ్లాడిన వారికి కటకటాలే.. వేలమంది భర్తలకు శిక్ష తప్పదు: అస్సాం సీఎం హెచ్చరిక
-
Politics News
Vatti Vasanth Kumar: మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కన్నుమూత
-
India News
Mughal Garden: మొగల్ గార్డెన్స్ ఇక.. ‘అమృత్ ఉద్యాన్’